భాష రాకపోయినా మా ఆయన బంగారం!
బాలీవుడ్ బ్యూటీ మోనాసింగ్ ఇటీవలే `ముంజియా` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీ మోనాసింగ్ ఇటీవలే `ముంజియా` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు సినిమా `లాల్ సింగ్ చడ్డా` నిరాశ పరిచినా `ముంజియా` ఆ లెక్కని బ్యాలెన్స్ చేసింది. `3 ఇడియట్స్` తో బాలీవుడ్ కి లోకి అడుగు పెట్టిన మోనా సింగ్ అటుపై మరికొన్ని హిట్లు అందుకుని నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలో తమిళ దర్శకుడు శ్యామ్ రాజగోపాల్ ని ప్రేమించి వివాహం చేసుకుంది.
2019 లో ఇద్దరు సిక్కు సంప్రదాయం ప్రకారం వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే మోనాసింగ్ సిక్కు అమ్మాయి...రాజ్ గోపాల్ మాత్రం సౌత్ కి చెందిన వ్యక్తి కావడంతో ఇద్దరి మధ్య భాష సమస్య వస్తుంది? కదా? ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నా స్థానిక భాష తెలియకపోతే కష్టం కదా? అనే ప్రశ్న మోనాసింగ్ ముందుకు వెళ్లింది. అందుకు మోనాసింగ్ ఇలా స్పందించింది. నాకు తమిళ్ కొద్దిగా తెలుసు.
నా భర్త గొప్ప వ్యక్తి. భాష లేకపోయినా భావాల్ని అర్దం చేసుకుంటాడు. ముఖ్యంగా నన్ను ఎంతో బాగా అర్దం చేసుకుంటాడు. అతడిని తప్ప మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే భరించలేకపోయేదాన్ని ఏమో. ఆ విషయంలో నేను చాలా లక్కీ అని నా స్నేహితులు అంటారు. మా ఇంట్లో సౌత్ ఇండియన్ పుడ్ కోసం మా వాళ్లు అంతా ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. నా భర్త దర్శక, నిర్మాత మాత్రమే కాదు. థియేటర్ ఓనర్ కూడా.
నేను ఎక్కడకైనా ఆగిపోతే నాకు అండగా నిలుస్తాడు. నిజంగా మా ఆయన బంగారం అని చెప్పగలను` అని తెలిపింది. మోనాసింగ్ ది చండీఘర్. లేటు వయసులో ఘాటు అవకాశాలు అన్నట్లు 42 ఏళ్ల వయసులో బాలీవుడ్ లో బిజీ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రెండు ..మూడు సినిమాలు చేస్తోంది.