అవమానంతోనే హీరోయిన్ గా మారిన మృణాల్!
నేడు పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. సినిమాల్లోకి రావాలి అన్న బీజం ఈనాటిది కాదు
సినిమాల్లోకి రావాలన్నా? సక్సెస్ అవ్వాలన్నా? ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. ధృడమైన సంకల్ప బలం ఉంటేనే ఇక్కడ అన్ని అవరోధాలు దాటుకుని ముందుకెళ్లగలరు. సక్సెస్ అవ్వగలరు. ఎలాంటి పరిస్థితుల్లోకి సినిమాల్లోకి వచ్చినా బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా సినిమాల్లోకి అలాగే వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చి అటుపై సినిమాల్లో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చింది.
నేడు పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. సినిమాల్లోకి రావాలి అన్న బీజం ఈనాటిది కాదు. చాలా ఏళ్ల క్రితమే పడింది. అందుకు ఓ బలమైన కారణం ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. `18 ఏళ్ల వయసులోనే బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చాను. నువ్వు ఇది చేయలేవని ఎవరైనా అంటే వారి మాటలను సవాల్ గా తీసుకుని దాన్ని నిరూపించడం నాకు ఓ అలవాటు.
నేను కాలేజీలో ఉన్నప్పుడే నా గురించి ఓ వ్యక్తి నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. అతను అన్నది తప్పు అని ఆ నాడే నిర్ణయించుకుని నిరూపించాలనుకున్నాను. ఆ క్షణమే నన్ను ఆడిషన్ వైపు నడిపించింది. అలా తొలిసారి టెలివిజన్ రంగంలోకి వచ్చి మ్యాకప్ వేసుకున్నాను. విజయాల గురించి పెద్దగా ఆలోచించను. ముందున్న ప్రయాణంపై మాత్రమే దృష్టి పెడతాను` అంది.
అంటే మృణాల్ ని ఎవరో అవమానించారని సినిమాల్లోకి వచ్చింది తప్ప తనకు తానుగా ఇష్టపడి ఫ్యాషన్తో సినిమాల వైపు రాలేదని ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇలాంటి భామలు చాలా మంది ఉన్నారు. డాక్టర్ కాబోయ్ యాక్టర్ అయ్యానని చెప్పిన జాబితా తీస్తే చాలా పెద్దదే ఉంటుంది. అలాగే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చామని చెప్పిన సంఖ్య భారీగానే ఉంటుంది.