ఏఎన్నార్ గురించి తొలిసారి నాగార్జున మనసులో మాట!
నటుడు అవ్వాలని నాగార్జున కూడా అంత వరకూ అనుకోలేదు.
నాగార్జున నటుడు అవ్వడానికి కారణం అన్నయ్య అక్కినేని వెంకట్. ఆయనే తండ్రి ఏఎన్నార్ కి తమ్ముడ్ని హీరోని చేద్దాం? అనే సలహా ఇచ్చారు. అప్పటి వరకూ నటుడ్ని చేయాలనే ఆశ గానీ, కోరిక గానీ ఏఎన్నార్ కిలేవు. చదువుకుని ఏ బిజినెస్ రంగంలోనే రాణిస్తాడని? ఆయన భావించారు. నటుడు అవ్వాలని నాగార్జున కూడా అంత వరకూ అనుకోలేదు. అలా నాగార్జున ...అన్నయ్య వెంకట్ సలహాతో నటుడిగా మారారు.
ఆ తర్వాత చిరంజీవి లాంటి స్టార్ డాన్సు లు చూసి? ఇదంతా మనవల్ల కాదని...మరో రంగం చూసుకుందామని నాగార్జున నిరుత్సాహ పడిన రోజులు ఉన్నాయి. మ్యాకప్ వేసుకోవడానికి ముందే? నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ అన్నయ్య ప్రోత్భలం..తనలో ఎక్కడో దాగిన చిన్న కోరిక నాగార్జునను ఇండస్ట్రీలో కింగ్ లా మార్చింది.
నాగార్జున హీరో అయిన తర్వాత మీడియా కెమెరా ముందు కూడా కనిపించడం చాలా తక్కువ. తన సినిమాలు రిలీజ్ లు ఉన్నప్పుడు..తండ్రికి సంబంధించిన ఏవైనా ఈవెంట్లు చేసినప్పుడు తప్ప! మిగతా సందర్భాల్లో కనిపించరు. అలాగే తన తండ్రి అంతటి వారు...ఇంతటి వారు? అని గొప్పలు పోయింది కూడా ఏనాడు లేదు. తండ్రి వారతస్వంతో సినిమాల్లోకి వచ్చారు...నటుడిగా కొనసాగడం తప్ప! తండ్రి నుంచి తాను నేర్చుకున్న అంశాల గురించి కూడా ఏనాడు ప్రస్తావించలేదు.
అయితే తాజాగా తొలిసారి నాన్నపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో భాగంగా ఏఎన్నార్ గురించి నాగార్జున ఇలా స్పందించారు. 'మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేసాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈస్థాయిలో ఉన్నాను. ఆయన క్రమశిక్షణ నన్నెంతో ఇన్ స్పైర్ చేసింది' అని అన్నారు. ఇంతవరకూ నాగార్జున ఈ విషయాలు ఎక్కడా పంచుకోలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.