కింగ్ నాగార్జున‌కు ఎంతమంది సిస్ట‌ర్స్?

అయితే ఆయ‌న‌కు అక్క‌జెల్లెళ్లు ఎంత‌మంది? అంటే అభిమానుల‌కు కూడా అంత‌గా తెలియ‌ద‌నే చెప్పాలి. నాగార్జున‌కు ముగ్గురు చెల్లెళ్లు ఒక సోద‌రుడు ఉన్నారు.

Update: 2023-10-21 01:30 GMT

లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వరరావు వార‌సుడిగా కింగ్ నాగార్జున టాలీవుడ్‌లో న‌టుడిగా, నిర్మాత‌గా, స్టూడియోస్ అధినేత‌గా కొన‌సాగుతున్నారు. ఇండ‌స్ట్రీ నాలుగు పిల్ల‌ర్ల‌లో ఒక‌రిగా నాగ్ పేరు తెచ్చుకున్నారు. తండ్రి అప్ప‌జెప్పిన సువిశాల‌మైన వ్యాపార సామ్రాజ్యాన్ని విజ‌య‌వంతంగా విస్త‌రించిన మేధావిగా నాగార్జున‌కు పేరుంది.

అయితే ఆయ‌న‌కు అక్క‌జెల్లెళ్లు ఎంత‌మంది? అంటే అభిమానుల‌కు కూడా అంత‌గా తెలియ‌ద‌నే చెప్పాలి. నాగార్జున‌కు ముగ్గురు చెల్లెళ్లు ఒక సోద‌రుడు ఉన్నారు. అక్కినేని నాగేశ్వర రావు- అన్నపూర్ణ దంపతులకు అయిదుగురు సంతానం. వెంకట రత్నం, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ. వీరిలో వెంక‌ట‌ర‌త్నం నిర్మాత వెంక‌ట్ గా సుప‌రిచితం. అయితే నాగార్జున -నాగ సుశీల సినీ పరిశ్రమలో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు కానీ మిగిలిన వారికి చెప్పుకోదగ్గ ఉనికి లేదు. అక్కినేని వెంక‌ట్ నిర్మాత‌గా కొనసాగారు గ‌నుక అయ‌న‌కు కొంత గుర్తింపు ఉంది. నాగ సుశీల త‌న‌యుడు సుశాంత్ హీరోగా న‌టించిన ప‌లు సినిమాల్ని నిర్మించారు. అలా ఆమె నిర్మాత‌గా సుప‌రిచితులు. అలాగే సుశీల సొంతంగా హైద‌రాబాద్ లో స్కూల్స్ ని నిర్వ‌హిస్తున్నారు.

అయితే మిగిలిన ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు ఏం చేస్తున్నారు? అంటే...కొన్నాళ్ల క్రితం ఒక సోద‌రి సత్యవతి మరణించారు. నటుడు సుమంత్, సుప్రియల తల్లి సత్యవతి. ఇటీవల సినీ రంగానికి దూరమైన నాగ సరోజ కూడా కన్నుమూసారు. ఈమె నాగార్జునకు మూడో పెద్ద చెల్లెలు. వెంకట్ - నాగ సుశీల సినిమా నిర్మాణంలో పాల్గొంటుండగా, సుప్రియ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యులకు సినిమా పరిశ్రమలో పాత్రలు ఉన్నాయి, కానీ నాగ సరోజ మొదటి నుండి దూరంగా ఉన్నారు. నాగార్జున సినిమా ఈవెంట్లలో లేదా ఇతర వేడుకల్లో కూడా ఆమె కనిపించలేదు. ప్రముఖ సినీ కుటుంబంలో భాగమైనప్పటికీ నాగ సరోజ నిరాడంబరమైన సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఈమధ్యనే సరోజ తన తండ్రి స్వర్గీయ నాగేశ్వర రావు గారి శత జయంతి సందర్భంగా అక్కినేని విగ్రహావిష్కరణ అన్నపూర్ణ స్టూడియోలో జరిగినప్పుడు ఆ సభలో సరోజ కనిపించినట్టుగా చెపుతున్నారు. ఇటీవ‌ల‌ నాగ సరోజ అనారోగ్యంతో కన్నుమూశారు.

నాగ్ కెరీర్ మ్యాట‌ర్:

నాగార్జున తదుపరి చిత్రం 'నా సామి రంగ' అధికారికంగా ప్రకటించారు. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించనున్నారు. టీజర్ తో సినిమాని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నాగార్జునను మాస్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి తన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ కథ -సంభాషణలు అందిస్తుండ‌గా, అకాడమీ అవార్డు గెలుచుకున్న స్వరకర్త MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నా సామి రంగా 2024లో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. మహేష్ బాబు గుంటూరు కారం కూడా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News