విడాకుల పుకార్లపై 'సింహా' హీరోయిన్ క్లారిటీ
ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు ఎంతో మంది తమ వివాహ బంధం తెచ్చుకుంటూ విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే
ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు ఎంతో మంది తమ వివాహ బంధం తెచ్చుకుంటూ విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. కలహాలతో కలిసి ఉండటం కంటే విడిపోయి ఎవరికి వారు హాయిగా, సంతోషంగా ఉండటం ఉత్తమం అన్నట్లుగా భావించి చాలా మంది విడాకులు తీసుకున్నారు.
హీరోలు, హీరోయిన్స్ తో ఈ జాబితా చాలా పెద్దదిగా మారుతుంది. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్ నమిత కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మీడియాలో జరిగిన పుకార్లతో ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.
నిజంగానే నమిత తన వివాహ బంధం ను తెంచుకునేందుకు విడాకులకి సిద్ధం అవుతుంది అంటూ అంతా మాట్లాడుకుంటున్న సమయంలో అధికారికంగా క్లారిటీ వచ్చింది. ఈ విషయాన్ని గురించి స్వయంగా నమిత స్పందిస్తూ పుకార్లే అంటూ కొట్టి పారేసింది.
ఇటీవలే నేను నా భర్త వీరేంద్ర చౌదరితో ఉన్న ఫోటోను షేర్ చేశాను. అయినప్పటికి మేము విడి పోయాం అంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రచారం చేయడం చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. నేను నటిగా గతంలో ఎన్నో పుకార్లు ఎదుర్కొన్నాను. కనుక ఈ పుకార్లు నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు.
విడాకుల వార్తలు మీడియాలో చూసి మేము నవ్వుకున్నాం. ఇలాంటి పుకార్లను పుట్టించడం ద్వారా మీకు ఏం వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని నమిత ప్రశ్నించింది. ఇలాంటివి ముందు ముందు అయినా ఆగుతాయి అని ఆశిస్తున్నాను అంది.
బాలకృష్ణ తో సింహా సినిమాలో నటించడం ద్వారా నమిత మళ్లీ బిజీ అవుతుందని అంతా భావించారు. అయితే టాలీవుడ్ లో నమితకు ఆఫర్లు చాలా తగ్గాయి. అదే సమయంలో కోలీవుడ్ లో మంచి ఆఫర్లు రావడంతో ఆమె ఫోకస్ మొత్తం అటుగా షిప్ట్ అయ్యింది. ప్రస్తుతం నమిత రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.