నాని.. విన్నింగ్ ఫార్ములా!
అతని సినిమా వచ్చిందంటే కుటుంబం అంతా కలిసి చూడొచ్చు అని బలంగా ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. దానికి కారణం అతని ఎంచుకున్న సినిమా కథలని చెప్పాలి.
నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు నాని. టాలీవుడ్ లో సహజనటి అనే బిరుదు జయసుధకి ఉంటే దానిని హీరోగా నాని తీసేసుకున్నాడు. అతని సినిమాలలో చేసే పాత్రలు అన్ని సమాజంలో ఎక్కడో ఓ చోట చూసిన విధంగానే ఉంటాయి. మన పక్కింట్లో జరిగిన కథల తరహాలో మూవీస్ ఉంటాయి. అందుకే ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అవుతాయి.
ఈ జెనరేషన్ లో డీసెంట్ కంటెంట్ లతో ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ అంటే నాని అని చెప్పాలి. అతని సినిమా వచ్చిందంటే కుటుంబం అంతా కలిసి చూడొచ్చు అని బలంగా ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. దానికి కారణం అతని ఎంచుకున్న సినిమా కథలని చెప్పాలి. నేను లోకల్, భలే భలే మగాడివోయ్, ఎంసిఏ, దసరా లాంటి కమర్శియలు సినిమాలు నాని ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి.
అలాగే జెర్సీ, ఎవడే సుబ్రమణ్యం, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, హాయ్ నాన్న లాంటి కథలు నానిలో నటుడిని పరిచయం చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. ఇప్పటి వరకు అతని కెరియర్ లో హిట్, ఫ్లాప్ సినిమాలు చూసుకున్న ఫ్యామిలీతో కలిసి చూడలేం అనే సినిమాలు లేవనే చెప్పాలి. కథల ఎంపికలో నాని ఎంత పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాడనేది అతని మూవీస్ చూస్తేనే అర్ధమవుతోంది.
ప్రయోగాలకి పెద్దపీట వేస్తూ కొత్త దర్శకులని ఎంకరేజ్ చేయడం ద్వారానే నాని ఎక్కువ సక్సెస్ లు సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు. ఎవరైనా దర్శకుడు కావాలని మంచి కథ సిద్ధం చేసుకుంటే ముందుగా నానిని అప్రోచ్ అవుతారు. కథ నచ్చితే ఆ సినిమా కచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుందనే నమ్మకం దర్శకులకి ఉంటుంది. ఈ రకమైన ప్లానింగ్ కారణంగానే అతని సినిమాల కలెక్షన్స్ పరంగా పెద్దగా నష్టాలు వచ్చినవి కనిపించవు.
ఆడియన్స్ లో నానికి ఉన్న పాజిటివ్ ఇమేజ్ హాయ్ నాన్న సినిమాకి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెడుతుంది. నిజానికి క్లాస్ కంటెంట్ ఉన్న చిత్రాలకి హిట్ వచ్చిన కలెక్షన్స్ పెద్దగా రావు. కాని నాని సినిమాలు మాత్రం అందుకు భిన్నంగా నిర్మాతలకి లాభాలు తెచ్చిపెడుతూ ఉండటం విశేషం.