క్లారిటీ లేకుండా రిలీజ్ డేట్స్.. నాని ఏమన్నారంటే..

గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎక్కువ కన్ఫ్యూజ్ నడుస్తోంది.

Update: 2024-08-23 10:37 GMT

గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎక్కువ కన్ఫ్యూజ్ నడుస్తోంది. మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినపుడే కొందరు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తున్నారు. తరువాత షూటింగ్ కంప్లీట్ కాలేదని ఒకసారి, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉందని మరోసారి రిలీజ్ డేట్ ని వాయిదా వేస్తున్నారు. ఇలా ఒక్కోసారి కనీసం రెండు, మూడు సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడి ఫైనల్ గా ఏదో ఒక డేట్ కి ఫిక్స్ చేసుకుమతున్నారు.

ఇలా జరగడం వలన ఇతర సినిమాలు రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కుతూ ఉంటాయి. అందుకే పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సరైన ప్రైమ్ డేట్ చూసుకొని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటారు. అయితే అదే సమయానికి మరో పెద్ద సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేస్తారు. దీంతో స్టార్ హీరోల సినిమాతో పోటీపడలేక చిన్న సినిమాలని వాయిదా వేసుకుంటారు.

సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో జరుగుతున్న ఈ కన్ఫ్యూజన్ వలన చాలా మంది నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారనే మాట ఇండస్ట్రీలో ఎప్పటికి వినిపించే మాట. అయితే తాజాగా నాచురల్ స్టార్ నాని మాత్రం ఈ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ పై ఓపెన్ అప్ అయ్యారు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల రిలీజ్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ పై నాని క్లారిటీ ఇచ్చారు.

సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే మార్చడం వలన నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ అందరూ నష్టపోతారని అన్నారు. తప్పనిసరి పరిస్థితిలో రిలీజ్ డేట్ వాయిదా వేయడంలో సమస్య లేదు. కానీ ఎలాంటి క్లారిటీ లేకుండా ఏదో ఒక డేట్ ఎనౌన్స్ చేసేద్దామనే రిలీజ్ డేట్ పై ప్రకటనలు ఇస్తే చాలా సమస్యలు వస్తాయి. ముందుగా ఒక రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసి ఆ టైంకి సినిమాని విడుదల చేయకుండా మరో తేదీని ప్రకటిస్తే ఆ ఇంపాక్ట్ చాలా సినిమాల పైన పడుతుంది.

ఈ విషయంపై దర్శక, నిర్మాతలు అందరూ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని సినిమాల రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని నాని తన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే నాని ఈ కామెంట్స్ ఏ సినిమాలని ఉద్దేశించి చేసాడనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎవరిని ఉద్దేశించి చేసిన ఆయన చేసిన కామెంట్స్ లో వాస్తవం ఉందని కొంతమంది సమర్థిస్తున్నారు.

Tags:    

Similar News