నితిన్ సినిమాకు వర్క్ చేసిన నాని.. అప్పట్లో గోడవేంటంటే

ప్రస్తుతం ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా నాని తన మార్కెట్ను పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

Update: 2023-12-04 16:27 GMT

నేచురల్ స్టార్ నాని కూడా మొదట దర్శకుడు అవ్వాలని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక తర్వాత నటుడిగా మారి ఇప్పుడు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా నాని తన మార్కెట్ను పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నాని మొదట్లో అయితే గ్రేట్ డైరెక్టర్ బాపు దగ్గర ఎక్కువగా సహాయక దర్శకుడుగా వర్క్ చేశాడు.

ఆ తర్వాత కె రాఘవేంద్రరావు దగ్గర కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా అనుభవం ఉంది. అయితే ఒకసారి నితిన్ సినిమాకు కూడా నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఆ సినిమా మరేదో కాదు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి బుల్లోడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాని నితిన్ చాలా ఎక్కువగా మాట్లాడుకునే వారట. ఆ విషయాన్ని నితిన్ ఇటీవల తన ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

నాని గురించి చెప్పిన నితిన్ అప్పట్లో సినిమా సెట్ లో అందరూ కూడా బాబు అని పిలిస్తే నాని మాత్రం నన్ను నితిన్ అని పేరు పెట్టి పిలిచేవాడు. సెట్స్ లో అయితే ఎక్కువగా నేను నాని తోనే మాట్లాడేది. అయితే ఒకరోజు నానిని నిర్మాత పిలిచి హీరోని బాబు అని పిలవకుండా అలా పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నావు అని ప్రశ్నించాడు.

అయితే మళ్లీ నేను నానిని పిలిచి నువ్వు నీకు నచ్చినట్లుగానే పిలువు వారి మాటలు ఏమీ పట్టించుకోవద్దు అని చెప్పాను. నాకు బాబు అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. ఇక అంతేకాకుండా నిత్ అని పిలువు అని కూడా చెప్పినట్లు నితిన్ తెలియజేసాడు. ఇక ఇప్పటినుంచి ప్రతిరోజు సెట్ లో అయితే నాని నన్ను నిత్ పిలిచేవాడు అని వివరణ ఇచ్చాడు.

ఇక నాని నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతుండగా నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ క్లాష్ గురించి కూడా నితిన్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. గతంలో కూడా మేము చేసిన రెండు సినిమాల ఒకేసారి వచ్చి మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలానే ఉంటుందని భావిస్తున్నట్లు వివరణ ఇచ్చాడు.

Full View
Tags:    

Similar News