కొడుకు కోసం ఎంత‌కైనా...ఇండియా దాటేది లేదు!

హార్దిక్ పాండ్యా- న‌టాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎవరి జీవితం వారిది.

Update: 2024-11-09 13:30 GMT

హార్దిక్ పాండ్యా- న‌టాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎవరి జీవితం వారిది. ఇరువురు రెండ‌వ పెళ్లికి కూడా రెడీ అవుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇప్ప‌టికే హార్దిక్ మ‌రో అమ్మాయితో డేటింగ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మాజీ భార్య న‌టాషా ఇండియా వ‌దిలి వెళ్ల‌నంటూ ప్ర‌క‌టించింది.

`నేనింకా ఇండియాలోనే ఉన్నాను. ఇక్క‌డే ఉంటాను. వ‌దిలి వెళ్లే ఆలోచ‌న కూడా లేదు. ఇదంతా కుమారుడు అగ‌స్త్య కోసే`. నేను-హార్దిక్ పాండ్యా విడిపోయినా అగ‌స్త్య కోసం కుటుంబంగానే ఉంటున్నాం. మా మ‌ధ్య స‌మ‌స్య‌లు కుమారిడిపై ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాం. అత‌డు మా ఇద్ద‌రి ప్రేమ పొందాల‌నుకుంటున్నాడు. ఆ ప్రేమ‌ను అందించాల్సిన బాధ్య‌త ఇద్ద‌రిపై ఉంది. అగ‌స్త్య నుంచి ఎన్నో విష‌యాలు నేర్చుకుంటున్నా.

ఏ త‌ల్లికైనా త‌న కొడుకు కంటే ఏదీ ఎక్కువ కాదు. అగ‌స్త్య విష‌యంలో నేను అంతే` అని అంది. హార్దిక్ తో విడాకుల త‌ర్వాత న‌టాషా తిరిగి సెర్బియా వెళ్లిపోయిన‌ట్లు ప్రచారం జ‌రిగింది. కుమారుడిని కూడా వెంట తీసుకెళ్లిపోయినట్లు వార్త‌లొచ్చాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కుమారుడిని తీసుకుని ఇండియాకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే న‌టాషా తాజా వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ఇంత‌వ‌ర‌కూ ఆమె ఇండియా వ‌దిలి వెళ్లిన‌ట్లు లేదు.

ఇరువురు భార‌తీయ చ‌ట్టం ప్ర‌కారం విడాకులు తీసుకున్నారు. కుమారుడుది చిన్న వ‌య‌సు కావ‌డంతో త‌ల్లి వద్ద‌నే ఉండాలి. అగ‌స్త్య‌కు ఏడేళ్లు వ‌చ్చిన త‌ర్వాత త‌ల్లి ద‌గ్గ‌ర ఉండాలా? తండ్రి వ‌ద్ద ఉండాలా? అనే నిర్ణ‌యం తీసుకునే హ‌క్కును క‌లిగి ఉంటాడు. అలాగని తండ్రి ప్రేమ‌కు దూరం కావాల్సిన ప‌నిలేదు. తండ్రి కుమారుడి బాధ్య‌త‌ల‌న్నీ కోర్టు ఆర్డ‌ర్ ప్ర‌కారం చూడొచ్చు.

Tags:    

Similar News