నిధి అగర్వాల్.. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలతో ఇలా..

ఒకే రోజులో విజయవాడలో "హరి హర వీర మల్లు" షూట్‌లో పాల్గొని, ఆ వెంటనే హైదరాబాద్‌కు ప్రయాణించి "ది రాజా సాబ్" షూటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చింది.

Update: 2024-10-16 15:17 GMT

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తన డెడికేషన్ తో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఒకే రోజు రెండు బిగ్ బడ్జెట్ చిత్రాల్లో నటించడం అంటే ఈ రోజుల్లో అంత సాధారణమైన విషయం కాదు. అయితే నిధి అగర్వాల్ ఈ టాస్క్‌ను ఎంతో సాఫీగా పూర్తి చేయగలిగింది. ఆమె అందుకు ఎంతో ఇష్టపూర్వకంగా హాజరై ప్రొఫెషనల్ మైండ్‌సెట్‌తో వ్యవహరించిందని తెరపై కనిపిస్తోంది.

హీరోయిన్‌గా ఎప్పుడూ కొత్తదనంతో కనిపించాల్సిన బాధ్యత నిధిపై ఉంది. ముఖ్యంగా పెద్ద చిత్రాల్లో నటిస్తే, ఎలాంటి ఆటంకం లేకుండా షూటింగ్ టైమ్ ను కాపాడుతూ సహా నటీనటులు, దర్శక నిర్మాతల సమయాన్ని వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ క్రమంలో నిధి అగర్వాల్ తన ప్రొఫెషనలిజాన్ని మరోసారి నిరూపించింది.

ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న "హరి హర వీర మల్లు" సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఒక పీరియాడికల్ ప్రిన్సెస్ పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ది రాజా సాబ్" సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి.

అయితే, ఈ రెండు చిత్రాల్లో భాగం అవుతూ ఒకే రోజు రెండు సిటీల మధ్య ప్రయాణించడం ఆమెకు ఓ ఛాలెంజ్‌గా మారింది. ఒకే రోజులో విజయవాడలో "హరి హర వీర మల్లు" షూట్‌లో పాల్గొని, ఆ వెంటనే హైదరాబాద్‌కు ప్రయాణించి "ది రాజా సాబ్" షూటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసం కూడా ఉంది.

"హరి హర వీర మల్లు"లో ఆమె ఒక పీరియాడికల్ లుక్‌లో ఉంటే, "ది రాజా సాబ్"లో ఒక స్టైలిష్ గ్లామరస్ గర్ల్ కనిపించనుంది. ఈ రెండు పాత్రల కోసం నిధికి లుక్, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు వేగంగా తీసుకు రావాల్సి ఉంటుంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిధి అగర్వాల్ తన పనితీరుతో అందరి మన్ననలు పొందింది. రెండు పాత్రల కోసం ప్రొఫెషనల్‌గా, శ్రద్ధగా పనిచేయడం ఆమె ప్రత్యేకత.

ఆమె డెడికేషన్‌ను మెచ్చుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయస్ఫూర్తితో పని చేయడం వల్లే ఆమె ప్రొఫెషనల్ కెరీర్‌లో ముందుకు దూసుకుపోతోందని అనిపిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలపై అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సక్సెస్ అయితే ఆమెకు ఇండస్ట్రీలో మరిన్నీ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News