రాజా సాబ్‌ సెట్ లో అందాల నిధి...!

ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా కూడా ప్రభాస్ బల్క్ డేట్లు ఇవ్వని కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.

Update: 2024-04-16 12:45 GMT

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా కూడా ప్రభాస్ బల్క్ డేట్లు ఇవ్వని కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.


ప్రస్తుతం జరుగుతున్న రాజా సాబ్‌ షెడ్యూల్‌ లో అందాల నిధి అగర్వాల్‌ పాల్గొంటుందని సమాచారం అందుతోంది. హైదరాబాద్‌ లోని శివారు ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు మారుతి జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తేలిపోయింది. ఇప్పుడు నిధి అగర్వాల్‌ కూడా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్‌ అయ్యింది. అందాల నిధి అగర్వాల్‌ ప్రస్తుతం పవన్‌ కు జోడీగా హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేక పోయింది. హరి హర వీరమల్లు మరియు రాజా సాబ్‌ సినిమాలతో ఈ అమ్మడు కచ్చితంగా మంచి విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక రాజా సాబ్‌ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు మారుతి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వర్క్‌ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ నటిస్తున్నాడు.

థమన్ సంగీతాన్ని అందిస్తుండగా వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. దర్శక నిర్మాతలు రాజా సాబ్‌ సినిమా విడుదల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. వారి నుంచి క్లారిటీ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News