అమితాబ్- SRK- రణవీర్ వీళ్లెవ‌రూ నిజ‌మైన‌ డాన్ కాదు!

బిగ్ బి అమితాబ్ బచ్చన్, SRK, లేదా రణవీర్.. వీళ్ల‌లో ఎవ‌రూ డాన్ కాదు. అస‌లైన డాన్ వేరొక‌రు ఉన్నారు

Update: 2024-03-04 10:30 GMT
అమితాబ్- SRK- రణవీర్ వీళ్లెవ‌రూ నిజ‌మైన‌ డాన్ కాదు!
  • whatsapp icon

బిగ్ బి అమితాబ్ బచ్చన్, SRK, లేదా రణవీర్.. వీళ్ల‌లో ఎవ‌రూ డాన్ కాదు. అస‌లైన డాన్ వేరొక‌రు ఉన్నారు. ఇంత‌కీ ఎవ‌రా డాన్? అంటే ఇదిగో ఇక్క‌డ ఈ వీడియోలో వీక్షించ‌వచ్చు. అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక‌లో టెలీకాస్ట్ చేసిన ఓ వీడియోలో త‌న స‌తీమ‌ణి నీతా అంబానీ 'నిజమైన' డాన్ అని ఆసియా రిచెస్ట్ బిజినెస్‌మేన్ ముఖేష్ అంబానీ అంగీక‌రించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోని అక్క‌డ ప్ర‌ద‌ర్శించ‌గా అహూతుల్లో న‌వ్వులు కురిపించింది.

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఇప్ప‌టికే డాన్ పాత్ర‌ల్లో న‌టించి ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచారు. ఇప్పుడు ఫ‌ర్హాన్ తెర‌కెక్కించ‌నున్న‌ డాన్ 3లో రణ్‌వీర్ సింగ్ డాన్ పాత్ర‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. అయితే అంతిమంగా డాన్ బిరుదు ఎవరిది? అనే దానిపై అభిమానుల్లో చర్చలు కొనసాగుతున్నాయి. మూవీ ఫ్రాంచైజీలో సరికొత్తగా చేరిన ముఖేష్ అంబానీ వీడియోలో వ్యాఖ్యానిస్తూ ''వీళ్లెవ‌రూ కాదు.. నీతా అంబానీ నిజమైన డాన్'' అని వెల్లడించారు.

తన కుమారుడు అనంత్ అంబానీ విలాసవంతమైన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో మూడో రోజున ముఖేష్ అంబానీ తనను తాను సలీం-జావేద్ సృష్టించిన 'డాన్'గా ఊహించుకుంటూ బిల్డ‌ప్ ఇవ్వ‌గా, అప్పుడే అతడి భార్య నీతా అంబానీ గదిలోకి ప్రవేశించింది. కానీ ఈ డాన్ పట్టుబడ్డాడు.. అంటూ చెబుతుంది. మ‌న‌ చిన్నబ్బాయి అనంత్‌ సంగీత్ వేడుక‌కు వెళ్లాలి ఛ‌లో! అంటూ నీతాజీ ఆర్డ‌ర్ వేస్తుంది. ముఖేష్ అంబానీ వెంట‌నే అక్క‌డి నుంచి లేచి త‌న‌ను అనుస‌రిస్తాడు. అవును, బాస్ అంటూ త‌న భార్య ప‌ట్ల విధేయ‌త‌ను ప్ర‌దర్శించ‌డం న‌వ్వులు కురిపిస్తుంది. చివర్లో 'డాన్' థీమ్ నేపథ్యంలో ముఖేష్ అంబానీ వాయిస్ ఓవర్ ఆక‌ట్టుకుంది. నీతాజీ క్వీన్ లా త‌న‌ సీటులో కూర్చుని శాసిస్తూ క‌నిపిస్తుంది. ''హుమారీ జిందగీ కి అస్లీ డాన్ ఏక్ హే థీ, ఏక్ హే హై ఔర్ ఏక్ హే రహేగీ'' అని ప్ర‌క‌టిస్తుంది. అయితే నీతా సన్ గ్లాసెస్ ధ‌రించే విధానం నిజ‌మైన డాన్ ని త‌ల‌పిస్తుంది.

ఆసక్తికరంగా, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ సహా హాజరైన అతిథులంతా ఈ వీడియో చూసి స‌ర్ ప్రైజ్ అయ్యారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (28), పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్- అతని భార్య శైలా మర్చంట్ ల‌ కుమార్తె రాధిక మర్చంట్ (29)తో జూలైలో వివాహం జరగనుంది.

Tags:    

Similar News