అంబానీల పెళ్లి సంద‌డిలో ఈ బూచోడు ఎవ‌రు?

ముఖేష్ అంబానీ-నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు

Update: 2024-06-27 13:50 GMT

 ముఖేష్ అంబానీ-నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ జంట 12 జూలై 2024న పెళ్లితో ఒక‌టి కాబోతున్నారు. తాళిక‌ట్టు ముహూర్తానికి ముందు కాబోయే వరుడు అతడి తల్లిదండ్రులు... మహారాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఖాన్‌ల త్ర‌యం, బ‌చ్చ‌న్‌లు, అక్ష‌య్, అజయ్ దేవ‌గ‌న్ సహా ప్రముఖ వ్యక్తులకు ఆహ్వానాలను పంపిణీ చేయడంలో బిజీగా ఉన్నారు.

ఇటీవ‌ల‌ ఈ జంట వివాహ ఆహ్వానం ఇంటర్నెట్‌లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. బిలియనీర్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఆహ్వానం ఎలా ఉందో ప‌రిశృలిస్తే.. అందులో ప్ర‌త్యేక‌త ఏమిటో అర్థ‌మ‌వుతుంది. మ‌రోవైపు అంబానీలు సెల‌బ్రిటీల‌కు శుభ‌లేఖ‌లు అంద‌జేసి పెళ్లికి స్వ‌యంగా ఆహ్వానిస్తున్నారు. ఇంత‌కుముందే అంబానీ కుటుంబం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఇంటికి వెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ముఖేష్ అంబానీ సీఎంను కలిసి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. అలాగే వరుడు కారులో కూర్చుని కనిపించాడు. భారీ పరివారం సెక్యూరిటీ గార్డులు కాపలాగా ఉన్నారు. మరోవైపు అనంత్ తన పెళ్లికి ఆహ్వానించడానికి నటులు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్- కాజోల్ ఇంటికి వెళ్లిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ యొక్క విపరీతమైన వేడుకలు మార్చిలో ప్రారంభమ‌య్యాయి. జామ్ న‌గ‌ర్ ఈవెంట్ తో పాటు, ప్యారిస్ క్రూయిజ్ షిప్ ఈవెంట్ ప్ర‌ధానంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాయి.

ఓర్రీ సందడి ఇలా ఉంది:

ఓవైపు అంబానీల ఇంట పెళ్లి సంద‌డి ఇలా ఉంటే.. మ‌రోవైపు ఫ్యాష‌నిస్టా.. పార్టీ క్రౌడ్ పుల్ల‌ర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి ఏం చేస్తున్నాడో చూసారా? పెళ్లికూతురు రాధిక‌తో అత‌డు క‌నిపించాడు. ``బ‌ట‌ర్ ఫ్లై బ‌ట‌ర్ ఫ్లై.. వేర్ ఆర్ యు గోయింగ్?`` అంటూ ఓర్రీ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో పెళ్లికూతురు రాధిక నీలి రంగు డిజైన‌ర్ దుస్తుల్లో ఎంతో అందంగా క‌నిపించింది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో ఓర్రీ ఫ‌న్ కూడా బ‌య‌ట‌ప‌డింది. అత‌డు ఒక సీతాకోక చిల‌క మెట‌ల్ మాస్క్ ధ‌రించి ఫోటోల‌కు ఫోజులిచ్చాడు. ఈ ప్ర‌త్యేక‌మైన ఫోటోగ్రాఫ్ క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. అయితే ఈ ఫోటోగ్రాఫ్ ని వీక్షించాక‌.. అంబానీల పెళ్లి సంద‌డిలో ఈ బూచోడు ఎవ‌రు? అంటూ నెటిజ‌నులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News