పవన్ కళ్యాణ్ మూవీస్.. ఇప్పట్లో కష్టమేనా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉన్నారు.

Update: 2024-07-13 07:30 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉన్నారు. ఐదు మంత్రిత్వ శాఖలు నిర్వహించడంతో పూర్తిస్థాయిలో అధికారిక కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖలు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తూ ఉండడం వలన విస్తృతంగా వాటిపై అధ్యయనం చేస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచి పవన్ కళ్యాణ్ అధికారిక కార్యాచరణలపైనే ఫోకస్ చేశారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రెడీ అవుతూ ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ కమర్షియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీస్ కారణంగా ఈ మూడు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం వాయిదా పడ్డాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు.

అయితే పరిపాలనలో భాగం కావడంతో సినిమాలపై ఫోకస్ తగ్గించారు. కానీ ఇవి ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యి ఉండటంతో కచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కి ఉంది. అయితే మూడు నెలల వరకు షూటింగ్స్ లో పాల్గొనలేనని పవన్ కళ్యాణ్ నిర్మాతలకి క్లియర్ గా చెప్పేశారంట. తరువాత వారానికి రెండు, మూడు రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా కన్ఫర్మ్ చేశారు. హరిహర వీరమల్లు మూవీ ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మూవీకి ఓ 20-25 రోజులు కాల్ షీట్స్ ఇస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. ఈ విషయాన్ని నిర్మాత తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కూడా ముందుగా ఈ సినిమాని పూర్తి చేసే అవకాశం ఉందంట. తరువాత ఓజీ కోసం డేట్స్ కేటాయించొచ్చనే మాట వినిపిస్తోంది.

ఓజీ మూవీ అయితే ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ఇప్పటికైతే కన్ఫర్మ్ అయిపొయింది. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన్నప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్న సాధ్యం కాకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. 2025 ప్రథమార్ధంలో హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వొచ్చని సమాచారం. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే వచ్చే ఏడాదిలోనే జరగనుంది. హరీష్ శంకర్ ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ లేదనే అనిపిస్తుంది.

Tags:    

Similar News