రివ్యూ : పోలీస్ స్టోరీ

శ్రీనాథ్, శ్వేతా, టెంపర్ శ్రీను లీడ్ రోల్స్ లో రామ్ విఘ్నేష్ డైరెక్ట్ చేసిన సినిమా పోలీస్ స్టోరీ. భాషా సినిమా నిర్మించిన సురేష్ కృష్ణ ఈ మూవీ నిర్మించారు. ఈటీవీ విన్ ఓటీటీ లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

Update: 2023-07-30 04:42 GMT

నటీనటులు: శ్రీనాథ్ మాగంటి, శ్వేత అవస్తి, టెంపర్ వంశీ, తదితరులు

సంగీతం: మీనాక్షి

మాటలు : సురేష్ బాబా

నిర్మాతలు: సురేష్ కృష్ణ

రచన-దర్శకత్వం: రామ్ విఘ్నేష్


శ్రీనాథ్, శ్వేతా, టెంపర్ శ్రీను లీడ్ రోల్స్ లో రామ్ విఘ్నేష్ డైరెక్ట్ చేసిన సినిమా పోలీస్ స్టోరీ. భాషా సినిమా నిర్మించిన సురేష్ కృష్ణ ఈ మూవీ నిర్మించారు. ఈటీవీ విన్ ఓటీటీ లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.


కథ :


ఐటీ జాబ్ చేస్తున్న కార్తీక్ హత్యకు గురవుతాడు. కార్తీక్ హత్యకు గురయ్యాడు అన్నది మొదట ఆర్తి (శ్వేత అవస్తి) చూస్తుంది. నైట్ షిఫ్ట్ లో జరిగిన ఈ మర్డర్ గురించి తెల్లారే సరికి కేస్ క్లోజ్ అయ్యేలా చూడాలని ఆ కంపెనీ సీ.ఈ.ఓ కమీషనర్ కి చెబుతాడు. తన పొలిటికల్ కెరీర్ కి ఇబ్బంది కాకూడదని ఆ సీ.ఈ.ఓ తనకు తెలిసిన ఏ.సి.పి రియాజ్ (టెంపర్ వంశీ) ని ఆ కేస్ డీల్ చేయమని చెబుతాడు. కమిషనర్ ఓ పక్క సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ శివ (శ్రీనాథ్ మాగంటి)ని ఈ కేసుని చూడమని చెబుతాడు. ఇంతకీ కార్తీక్ ని మర్డర్ చేసింది ఎవరు..? రియాజ్, శివలలో ఆ కిల్లర్ ని ఎవరు కనిపెట్టారు..? శివ సడెన్ గా ఆ కేసు తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి..? అతనెందుకు సస్పెండ్ అయ్యాడు..? అన్నది సినిమా కథ.


కథనం - విశ్లేషణ :


క్రైం థ్రిల్లర్ సినిమాలు దాదాపు అన్నీ ఒక సర్టైన్ టైం గ్యాప్ లోనే పూర్తి అవుతాయి. ఈ పోలీస్ స్టోరీ సినిమా కూడా అంతే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జరిగే కథ. అయితే క్రైం థ్రిల్లర్ కథల్లో ఉండాల్సిన సస్పెన్స్, క్యూరియాసిటీ ఇవేవి ఈ సినిమాలో కనిపించవు. తమ కొలీగ్ మర్డర్ అయ్యాడు ఆ నైట్ షిఫ్ట్ లో పనిచేసే 9 మందిలో ఒక కిల్లర్ ఉన్నాడని తెలిసి కథ కథనాలు ఏవి ఆశించిన స్థాయిలో నడిపించలేదు.

క్రైం థ్రిల్లర్ సినిమాలకు కథనం ఎంతో గ్రిప్పింగ్ గా ఉండాలి. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అసలేమాత్రం ఆకట్టుకోలేదు. కార్తీక్ మర్డర్ గురించి తెల్లారే సరికి అంతా క్లియర్ అవ్వాలని ఆ కంపెనీ సీ.ఈ.ఓ కమీషనర్ కి టార్గెట్ ఇవ్వడం. కమిషనర్ ని కాకుండా మళ్లీ మరో ఏ.సి.పీ రియాజ్ కి కేస్ అప్పగించడం లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. మరోపక్క శివ వర్సెస్ రియాజ్ ఇద్దరు ఏ.సి.పీ కేడర్ ఆఫీసర్స్ కానీ ఎదురుపడితే చాలు గొడవ పడుతూ ఉంటారు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది అసలు చూపించలేదు.

బహుశా అంతా పర్ఫెక్ట్ గా ఉండాలనే శివకి రియాజ్ చేసే పనులు నచ్చవు కాబట్టే వారిద్దరికి పడదు అనుకుంటా కానీ ఇది ఆడియన్స్ అర్థం చేసుకునేలా అయినా ఎంగేజింగ్ సీన్స్ ఉన్నాయా అంటే అది కూడా లేదు. ఇక శివ ఆర్తీల ఫ్లాష్ బ్యాక్ ఆమె సినిమాకు రాలేదన్న రీజన్ వల్ల డివోర్స్ ఇవ్వడం కన్విన్స్ గా అనిపించలేదు. లీడ్ రోల్స్ అయిన శివ ఆర్తిల మధ్య ఏమాత్రం కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయినట్టు అనిపించలేదు.

రియాజ్ పాత్రలో టెంపర్ వంశీ తన పాత్రకు న్యాయం చేశాడు కానీ అతని క్యారెక్టరైజేషన్ రాసుకోవడం లో మాత్రం దర్శకుడు తడబడ్డాడు అని చెప్పొచ్చు. శివ పాత్ర కూడా కమీషనర్ సైకాలజిస్ట్ ని కలవమని సస్పెన్షన్ లో ఉంచడం లాంటి వెనుక బలమైన రీజన్స్ ఏంటన్నది చూపించలేకపోయాడు.

క్రైమ్ థ్రిల్లర్ కథల్లో చివరికి ట్విస్ట్ రివీల్ చేసే టైం లో అయినా ఆడియన్స్ వావ్ అనే ఛాన్స్ ఉంటుంది. కానీ పోలీస్ స్టోరీ విషయంలో అది కూడా నిరాశపరుస్తుంది. సినిమా అంతా ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది అన్నట్టు ఉంటుందే తప్ప ఎక్కడ హై మూమెంట్ కనిపించదు. అసలు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా ఏదో ఇదివరకు సినిమాలను చూసి కాపీ కొట్టినట్టే అనిపిస్తుంది.

ఉన్నంతలో శివ కిల్లర్ ని కనిపెట్టే సీన్ అది కూడా పతాక సన్నివేశాల్లో కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. భాషా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన సురేష్ కృష్ణ ఈ సినిమా నిర్మించారు. కానీ ఒక రొటీన్ క్రైమ్ కథతో అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో వచ్చిన పోలీస్ స్టోరీ ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.


నటీనటులు :


శివ పాత్రలో శ్రీనాథ్ జస్ట్ ఓకే అనిపించాడు. హిట్ సీరీస్ లో నటించిన అతను సినిమాలో ఇంకాస్త బెటర్ గా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. టెంపర్ వంశీ నెగటివ్ షేడ్స్ లో మెప్పించాడు. ఆర్తి పాత్రలో నటించిన శ్వేత పర్ఫార్మెన్స్ కూడా జస్ట్ ఓకే అనిపిస్తుంది. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించారు. డైరెక్టర్ రాం విఘ్నేష్ నటీనటుల నుంచి ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ తీసుకోవాల్సింది.


సాంకేతికవర్గం :


సురేష్ కృష్ణ ఈ కథలో ఏం నచ్చి నిర్మించారో కానీ రొటీన్ క్రైమ్ కథతోనే పోలీస్ స్టోరీ వచ్చింది. నిర్మాణ విలువలు గొప్పగా ఏం లేవు. రామ్ విఘ్నేష్ అన్ని యాక్సెప్ట్ లో ఫెయిల్ అయ్యాడు. సినిమాను ఆడియన్స్ కి ఎంగేజ్ చేయడంలో ఏమాత్రం సక్సెస్ కాలేదు. సినిమా అంతా బోరింగ్ గా సాగుతుంది. ఫస్ట్ షాట్ లోనే కార్తీక్ మర్డర్ అవడం దగ్గర నుంచి చివరి వరకు అతన్ని ఎవరు చంపారన్న సస్పెన్స్ ని సాగదీశారు. మధ్యలో ఆడియన్స్ ని మిస్ గైడ్ చేయాలని చూసినా అవేవి వర్క్ అవుట్ అవ్వలేదు. మీనాక్షి అందించిన బిజిఎం సినిమాకు హెల్ప్ అయ్యింది. సినిమాటోగ్రఫీ ఉన్నంతలో బాగానే తీశారు. ఇలాంటి సినిమాలకు ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉండాల్సి ఉంది. కానీ పోలీస్ స్టోరీ నైట్ ఓల్స్ లో ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. డైరెక్టర్ రామ్ విఘ్నేష్ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు. క్రైం థ్రిల్లర్ ని ఆడియన్స్ కి చేరువేయడంలో అతను తడబడ్డాడు.


చివరిగా : పోలీస్ స్టోరీ.. ఏమాత్రం ఆకట్టుకోని క్రైం థ్రిల్లర్..!

Tags:    

Similar News