ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా డిజాస్టర్ మూవీ రీ-రిలీజ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న తన 45వ పుట్టినరోజును జరుపుకోనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-16 05:39 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న తన 45వ పుట్టినరోజును జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి, ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి క్రేజీ అప్డేట్లు రాబోతున్నాయి. అదే సమయంలో రెబల్ స్టార్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీస్ ప్లానింగ్ విషయంలో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా అక్టోబర్ 22న 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినట్లు తెలిపింది. అక్టోబరు 23న ప్రభాస్ డెబ్యూ మూవీ 'ఈశ్వర్' ను 4Kలో గ్రాండ్ గా రీ-రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 60 అడుగుల కట్ ఔట్ పెట్టాలని చూస్తున్నారు.

ఇక అక్టోబర్ 19, 20 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' సినిమా స్పెషల్ షోలు వేస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబరు 23న 'రెబల్'4K మూవీని మళ్ళీ థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాత, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ప్రకటించారు. 22వ తేదీ రాత్రి నుంచే స్పెషల్ షోలు వేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ రీరిలీజ్ పై ప్రభాస్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనిపై ఎక్స్ లో కామెంట్ల రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ మూవీ 'రెబల్'. 2012లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అలాంటి సినిమాని నట్టి కుమార్ గతంలో 4K రిజల్యూషన్ లో రీ-రిలీజ్ చేశారు. దీనికి జనాలను నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇతర హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులను దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే చిత్రాన్ని ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రీ-రిలీజ్ చేస్తుండటంపై ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా తమ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమాలను రీరిలీజ్ చేయడం అనేది టాలీవుడ్ లో ట్రెండ్ గా కొనసాగుతోంది. మామూలుగా అయితే అందరు బ్లాక్ బస్టర్ సినిమాలను, కల్ట్ క్లాసిక్ చిత్రాలను విడుదల చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభాస్ బర్త్ డేకి ఒకేసారి నాలుగు సినిమాలు రీ-రిలీజ్ చేస్తుండటం, వాటిల్లో ఒక డిజాస్టర్ మూవీ కూడా ఉండటం గమనార్హం.

ఏదేమైనా ప్రభాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని, ప్లానింగ్ లేకుండా ఇలా మూడు నాలుగు సినిమాలను రీ-రిలీజ్ చేయడం సరికాదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అనుకున్నప్పటికీ, వరుసగా ఇన్ని సినిమాలు వదలడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రానికి కూడా ఆశించిన మేర వసూళ్లు ఉండవని అంటున్నారు. ఇది తమని ట్రోల్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ కు అవకాశం కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News