రాజమౌళి × ప్రభాస్.. ఈ ఇద్దరిదే అసలు డామినేషన్

బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాల సంఖ్య క్రమంగా పెరిగింది.

Update: 2024-07-03 04:10 GMT

బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాల సంఖ్య క్రమంగా పెరిగింది. స్టార్ హీరోలు తమ మార్కెట్ ని ఇండియన్ వైడ్ గా విస్తరించుకోవడానికి మేగ్జిమమ్ పాన్ ఇండియా బేస్డ్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కథలతోనే సినిమాలు చేస్తున్నారు. వీటికి థీయాట్రికల్ మార్కెట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే మల్టీపుల్ లాంగ్వేజ్ లలో తీసే సినిమాలకి డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు రైట్స్ కోసం ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేస్తాయి.

దీనిని దృష్టిలో ఉంచుకొని టైర్ 1 హీరోలు అందరూ పాన్ ఇండియా కథలతోనే మూవీస్ చేస్తూ ఉన్నారు. టైర్ 2 హీరోలలో కొంతమంది పాన్ ఇండియా భాషలలో తమ సినిమాలని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషలలో మూవీ పెద్దగా క్లిక్ కాకపోయిన డిజిటల్ మార్కెట్ కోసం ఈ దారి ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో మూవీలు చేస్తోన్న కూడా స్ట్రైట్ తెలుగు చిత్రాలుగానే రిలీజ్ చేస్తున్నారు.

ఇతర భాష నటులని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా కేవలం తెలుగు భాషలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల జాబితా చూసుకుంటే అందులో టాప్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ ఉంటుంది. రాజమౌళి నుంచి వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం తెలుగులో 365 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ కలెక్షన్. రెండో స్థానంలో కూడా రాజమౌళినే ఉన్నారు.

Read more!

ఆయన నుంచి వచ్చిన బాహుబలి 2 మూవీ వరల్డ్ వైడ్ గా కేవలం తెలుగు వెర్షన్ 310 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తరువాత స్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడని చెప్పొచ్చు. అతని నుంచి వచ్చిన సలార్ మూవీ అత్యధికంగా 213 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 3లో ఉంది. ఇక తాజాగా రిలీజ్ అయిన కల్కి మూవీ తెలుగు వెర్షన్ 200+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి టాప్ 4లోకి వచ్చింది. అంటే తెలుగు లాంగ్వేజ్ పరంగా టాప్ లో రాజమౌళి, ప్రభాస్ రూలింగ్ సాగుతోందని అర్ధం చేసుకోవచ్చు.

టాప్ 5లో రాజమౌళి బాహుబలి మూవీ 183.34 కోట్ల కలెక్షన్స్ తో నిలిచింది. ఈ రికార్డ్స్ దరిదాపుల్లోకి ఇప్పట్లో ఏ హీరో వచ్చే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. అయితే ఈ కలెక్షన్స్ రికార్డ్స్ లో ఏదో ఒకటి పుష్ప2 తో అల్లు అర్జున్, దేవర సినిమాతో తారక్ బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News

eac