తమన్నా పై వ్యాఖ్యలు అతడి తాజా రియాక్షన్ ఇలా!
'నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి' అని అన్నారు. దీంతో తమన్నా అభిమానులు శాంతిచ్చారు.
మిల్కీ బ్యూటీ తమన్నాని ఉద్దేశించి కోలీవుడ్ నటుడు పార్తిబన్ ఇటీవల అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో తమన్నా ఉంటే డాన్సులుంటే చాలు కథలేకపోయినా పర్వాలేదు. సినిమా హిట్ అవుతుందని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని వ్యాఖ్యానించారు. అవి నెట్టింట వైరల్ గా మారాయి. పార్తిబన్ వ్యాఖ్యల్ని కొందరు తప్పు బట్టారు. ఓ మహిళా నటిని ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యాఖ్యల్ని పార్తిబన్ వెనక్కి తీసుకున్నారు. తమన్నాకి క్షమాపణలు చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరిపైనా తనకు గౌరవం ఉందన్నారు. 'నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి' అని అన్నారు. దీంతో తమన్నా అభిమానులు శాంతిచ్చారు. చేసే వ్యాఖ్యలు హుందాగా ఉంటే చాలు..క్షమాపణలు కోరుకోవడం లేదని కొంత మంది నెటిజనులు పోస్టులు చేస్తున్నారు.
ఆ మధ్య మరో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా నోటి దురుసుతో త్రిషపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'లియో' సినిమాలో త్రిషతో అత్యాచార సన్నివేశం ఉంటే బాగుండని ఆయన చేసి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. వాటికి ధీటుగా త్రిష కూడా స్పందించింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ఈ వివాదం చివరికి కోర్టుకి వెళ్లింది. దీంతో మన్సూర్ అలీఖాన్ దే తప్పు కావడంతో కోర్టు దండించింది. మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు చెప్పాల్పి వచ్చింది.
మన్సూర్ వ్యాఖ్యల్ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఖండించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తమన్నాపై పార్తిబన్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పార్తిబన్ దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రల్లర్ 'టిన్జ్' ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లోనే పార్తిబన్ తమన్నా పై అభ్యంతర వ్యాఖ్యలు చేసాడు. 'జైలర్', 'బాక్' సినిమాల్లో తమన్నా డాన్సుల్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెరపైకి వచ్చింది.