న్యూస్ రీడర్ నుంచి హీరోయిన్ గా!
'కళ్యాణం కమనీయం'..'రుద్రుడు' లాంటి చిత్రాల్లో నటించిన ప్రియా భవానీ శంకర్ సుపరిచితమే
'కళ్యాణం కమనీయం'..'రుద్రుడు' లాంటి చిత్రాల్లో నటించిన ప్రియా భవానీ శంకర్ సుపరిచితమే. అమ్మడికి ఆ సినిమాలు పెద్దగా గుర్తింపును తేలేదు..గానీ ఓటీటీలో రిలీజ్ అయిన 'దూత'తో మాత్రం బాగా ఫేమస్ అయింది. నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్.కె. కుమార్ తెరకెక్కించిన ఆ సిరీస్ మంచి విజయం సాధించడంతో ప్రియాకి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వరిస్తు న్నాయి.
తమిళ్..తెలుగలో కొన్ని సినిమాలు చేస్తోంది. అయితే ఈ బ్యూటీకి పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేదు. కింద స్థాయి నుంచి ఎదిగిన హీరోయిన్ అని తెలుస్తోంది. చెన్నైకి చెందిన ప్రియా భవానీ శంకర్ అమ్మనాన్నల కోసం బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఎంబీఏ కూడా చదివింది. ఉద్యోగం చేయాలని ఇంట్లో వారి కోరిక. కానీ అమ్మడికి మాత్రం సినిమాలంటే పిచ్చి. కానీ ఎలా వెళ్లాలి అన్నది తెలియదు. వెనుకాల తెలిసిన వాళ్లు ఎవరూ లేరు .
దీంతో తొలుత ఓ టీవీ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ పరిచయాలతో సీరియళ్లకు ప్రమోట్ అయింది. అక్కడ బాగానే అవకాశాలు అందుకుంది. నటిగా నిరూపించుకునే ఓ వేదిక దొరక డంతో బుల్లి తెర నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది. అటుపై యాంకర్ గా..సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు దక్కించుకోవడం ఇలా జర్నీ కొంత కాలం సాగించింది. ఇక 2023 లో రిలీజ్ అయిన 'కళ్యాణం కమనీయం'..'రుద్రుడు' సినమాలతో తెలుగు తెరపై మెరిసింది.
అటుపై చైతన్య నటించిన 'దూత'తో బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు అవకాశాలు క్యూలో ఉన్నాయి. ఆ రకంగా అమ్మడు తన నటించాలన కోరికనను నెరవేర్చుకుంది. ఈ క్రమంలో చాలా సవాళ్లు ఎదుర్కుంది. అన్నింటిని దాటుకుని వచ్చింది కాబట్టే నిలబడగలిగింది. ప్రస్తుతం 'డిమోంటీ కాలనీ-2' లో నటిస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ మొదటి భాగం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే శంకర్ దర్శకత్వం వహిస్తోన్న 'ఇండియన్-2' లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో ప్రియా పాన్ ఇండియాలో సక్సెస్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకుంది.