రాజమౌళి వాళ్లిద్దరిపైనా కోప్పడ్డాడా?
రాజమౌళి-ప్రభాస్-సత్యరాజ్ `బాహుబలి` సినిమాకి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
రాజమౌళి-ప్రభాస్-సత్యరాజ్ `బాహుబలి` సినిమాకి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాకి కెప్టెన్ అయితే ప్రభాస్ బాహుబలి., సత్యరాజ్ కట్టప్ప పాత్రలు పోషించారు.ఆ రెండు పాత్రల్ని జక్కన్న ఎంత గొప్పగా ఆవిష్కరించాడో తెలిసిందే. అంత గొప్పగా రావడనికి రాజమౌళి ఒక కారణమైతే? నటీనటుల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ అన్నది మరో కారణం. ఏ నటీనటుల మధ్యనైనా మంచి స్వేచ్ఛ కుదిరినప్పుడే అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి.
ఆ సినిమా కారణంగా సత్యరాజ్-ప్రభాస్ మంచి స్నేహితులుగానూ మారిపోయారు. అంతకు ముందే కొన్ని సినిమాలకు కలిసి పనిచేయడంతో ఈ సినిమాకి మరింత ఈజీగా పనిచేయగలిగారు. అయితే సెట్స్ లో వీళ్లిద్దర్నీ రాజమౌళి చూసి కుళ్లుకున్న సందర్భం కూడా ఉందంటండోయ్. సీన్ అయిపోయిన తర్వాత ప్రభాస్- సత్యరాజ్ జోకులేసుకుని మాట్లాడుకునేవారుట. సెట్ లో ఎక్కడ చూసినా వీళ్లిద్దరే రాజమౌళికి ఎక్కువగా కనిపించేవారుట.
ప్రభాస్ స్పాంటేనియస్ గా జోకులు, పంచ్ లు వేసేవారు అట. సత్యరాజ్ కూడా అదే తీరులో ఉండేవారుట. ఇలా జోకులతో సెట్ లో టైంపాస్ చేసిన చాలానే ఉన్నాయన్నారు. అయితే రాజమౌళి వీటిని ఓ కంట కనిపెడుతూనే కనిపెట్టనట్లు నటించేవారుట. వాళ్లిద్దర్నీ అలా చూసి సినిమాలో సీన్లు ఎక్కడో చెడగొడతారోనని భయం కూడా జక్కన్నకి వేసేదిట. మనసులో ఉన్నా? బయటకు ఏనాడు ఓపెన్ అవ్వలేదుట.
వాళ్లిద్దరి క్లోజ్ నెస్ చూసి రాజమౌళి చాలాసార్లు తలపట్టుకున్నారుట. ఓ సందర్భంలో సరదాగా కోపడిన సందర్భం ఉందట. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి ఇరువురు తమ పాత్రల్లోకి వెళ్లిపోతే మరో ఆలోచన లేకుండా పనిచేసే వారని సత్యరాజ్ ఓ సందర్భంలో తెలిపారు. అది చూసి రాజమౌళి ఎంతో సంతోషంగా ఫీలయ్యే వారుట. ఇద్దరు జోకులేసుకున్నా పని మాత్రం పర్పెక్ట్ గా చేస్తున్నారని జక్కన్న అప్పుడప్పుడు పొగిడేవారంట కూడా.