తలైవా రెచ్చిపోతే ఇలా ఉంటది మరి!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కెరియర్ ఆరంభంలో కొన్ని స్ట్రైట్ సినిమాలలో సెకండ్ లీడ్, విలన్ పాత్రలు చేశారు. అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం వరుస సక్సెస్ లు అందుకొని సూపర్ స్టార్ అయిపోయారు. ఏకంగా తమిళ ప్రజల ఆరాధ్యంగా రజినీకాంత్ మారిపోయారు.
రజినీకాంత్ స్టైల్, మేనరిజమ్స్ కి తమిళ్ ప్రేక్షకులు బాగా అడిక్ట్ అయిపోయారు. చాలా కాలం తర్వాత భాషా సినిమా మళ్ళీ రజినీకాంత్ కి టాలీవుడ్ సూపర్ సక్సెస్ అందించింది. అప్పుడు సూపర్ స్టార్ స్టైల్ కి తెలుగు ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. అప్పటి నుంచి తమిళంలో రజినీకాంత్ చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది.
కొన్ని చిత్రాలు అయితే కోలీవుడ్ లో ఏవరేజ్ తెచ్చుకుంటే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. రజినీకాంత్ నరసింహ సినిమా తెలుగులో సెన్సేషన్ హిట్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానమైన రేంజ్ కి రజినిని తీసుకొచ్చింది. రోబో మూవీ అయితే ఇండియాలోనే ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలిచింది. పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ ఈ సినిమా సక్సెస్ అయ్యింది.
అయితే తరువాత రజినీకాంత్ ఇమేజ్ కి తగ్గ కథలతో దర్శకులు సినిమాలు చేయలేకపోయారు. సూపర్ స్టార్ యంగ్ దర్శకులకి ఛాన్స్ ఇచ్చిన వారంతా తమిళ్ నేటివిటీకి యాప్ట్ అయ్యే కథలతోనే మూవీస్ చేయడం కూడా సూపర్ స్టార్ కి సరైన సక్సెస్ పడకపోవడానికి కారణం అని చెప్పాలి. అందుకే రోబో తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ తెలుగులో రజినీకాంత్ కి ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదు.
మరల జైలర్ మూవీతో సూపర్ స్టార్ స్టామినా ఏంటో అందరికి అర్ధమైంది. కమర్షియల్ కథ అయిన రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఇందులోపుష్కలంగా ఉన్నాయి. దీంతో తమిళనాడు స్థాయిలోనే తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి మూడు రోజుల్లోనే 12 కోట్లతో కొన్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.
భోళా శంకర్ డివైడ్ టాక్ రావడంతో అక్కడ కూడా జైలర్ ని రీప్లేస్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ లలో కూడా విపరీతంగా బుకింగ్స్ అవుతున్నాయి. మరో పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో జైలర్ ప్రభంజనం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే 25 నుంచి 30 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.