రానా ఫుడ్ స్టోరీస్ లో చరణ్ కూతురు.. పిక్ వైరల్

ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన కొణెదల బంజారాహిల్స్ లో ఓమ్ని ఛానల్ గౌర్మెట్ గ్రోసరీ స్టోర్ లో ఫుడ్ స్టోరీస్ ని సందర్శించారు.

Update: 2025-01-27 13:04 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణెదల కూతురు క్లిన్ కార కొణెదలతో కలిసి రెగ్యులర్ గా బయటకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వారు తమ కుమార్తె ఫేస్ రివీల్ చేయలేదు. రీసెంట్ గా ‘అన్ స్టాపబుల్ షో’లో రామ్ చరణ్ తన కుమార్తె ఫేస్ ఎప్పుడు చూపించేది చెప్పారు. క్లిన్ కార తనని డాడీ అని పిలిచిన తర్వాత అందరికి పరిచయం చేస్తానని చెప్పారు.

అందుకే కూతురుతో కలిసి బయటకి వెళ్లిన కూడా వారు క్లిన్ కార ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన కొణెదల బంజారాహిల్స్ లో ఓమ్ని ఛానల్ గౌర్మెట్ గ్రోసరీ స్టోర్ లో ఫుడ్ స్టోరీస్ ని సందర్శించారు. రానా దగ్గుబాటి దీనిని ఏర్పాటు చేశారు. రానా ఓ వైపు సినిమాలు చేస్తూనే డిఫరెంట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ఈ ఫుడ్ స్టోరీస్ ని ఏర్పాటు చేశాడు. దీనికి ఉపాసన కొణెదల తన తల్లి శోభన కామినేని, కూతురుతో కలిసి వెళ్లారు. ఈ ఫోటోని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రానా దగ్గుబాటి, మిహికాకి ఈ సందర్భంగా ఉపాసన థాంక్స్ చెప్పారు. స్టోరీలో సిబ్బంది తమని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారని ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ వారసురాలిని చూడాలని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకి ఈ ఫోటోలో కూడా ఆమె ఫేస్ కనిపించకపోవడం నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ మూవీలో చేస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. సినిమా షూటింగ్ లేని సమయంలో రామ్ చరణ్ ఎక్కువగా కూతురు క్లిన్ కారతోనే ఇంట్లో ఆడుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News