ఓటీటీ రిలీజ్ హీరో చేతుల్లోనా?
స్టార్ హీరోతో సినిమా అయినా...స్టార్ డైరెక్టర్తో సినిమా అయినా నిర్మాతకు ఎన్నో రకాల కండీషన్లు ఉంటాయి.;
స్టార్ హీరోతో సినిమా అయినా...స్టార్ డైరెక్టర్తో సినిమా అయినా నిర్మాతకు ఎన్నో రకాల కండీషన్లు ఉంటాయి. నిర్మాత కదా అని స్వయంప్రతి పత్తి కలిగి ఉంటాడు అని అనుకోవడానికి లేదిక్కడ. కోట్ల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టినా? చాలా విషయాల్లో హీరో-డైరెక్టర్ చెప్పినట్లు వినాల్సిందే. ముఖ్యంగా మార్కెట్ విషయంలో? ఆదేశాలు తప్పక పాటించాల్సిందే. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన నాటి నుంచి కంటెంట్ పై నిర్మాత బలం తగ్గిందన్నది వాస్తవం.
ఒకప్పుడు సినిమా పూర్తి చేసే వరకే హీరో-డైరెక్టర్ బాధ్యత ఉండేది. కానీ ఇప్పుడు బిజినెస్ వ్యవహారాల్లోనూ హీరోల ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ మార్కెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిర్మాతల రెండు చేతులు కట్టేసిన పరిస్థితి ఏర్పడుతుంది. శాటిలైట్-ఓటీటీ రైట్స్ విషయంలో కంటెంట్ అమ్మాలంటే? నిర్మాతకు తల ప్రాణం తోకకు వస్తుంది. థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ మీదనే ఓటీటీ ముందొస్తు బిజినెస్ ఆధారపడి ఉంటుంది.
థియేట్రికల్ రిలీజ్ పరంగా బజ్ లేకపోతే? ఓటీటీ కూడా కొనడానికి వెనకడుగు వేస్తుంది. తాజాగా ఆర్సీ 16 ఓటీటీ రైట్స్ విషయంలో హీరోగారి ఇన్వాల్వ్ మెంట్ బయటకు వచ్చింది. ఆర్సీ 16కి సోనీలివ్ పెద్ద మొత్తంలో ఆఫర్ చేసిందిట. కానీ డిజటల్ మార్కెట్ పరంగా వెనుకబడి ఉండటంతో హీరో నెట్ ప్లిక్స్ ని లైన్ లోకి తెచ్చే ప్రయత్నం చేసారుట. అయితే నెట్ ప్లిక్స్ సోనీలివ్ కంటే తక్కువకే కోట్ చేసిందిట.
సోనీ కంటే నెట్ ప్లిక్స్ అయితే సినిమాకి గ్లోబల్ రీచ్ ఉంటుంది అన్న కోణంలో చరణ్ ఇలా ప్లాన్ చేసాడు. అయితే 2025లో నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదుట. చాలా సినిమాలకు రిలీజ్ కు ఉండటంతో ఆర్సీ 16కి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో వచ్చే ఏడాది రిలీజ్ పరంగా డీల్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నారుట. అదే గనుక జరిగితే ఆర్సీ 16 థియేటర్లో రిలీజ్ అయ్యేది వచ్చే ఏడాదే. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.