టార్గెట్ అయిన స్టార్ హీరో.. కార‌ణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్- ఏఎన్నార్ త‌మ కంటే స‌గం వ‌య‌సు ఉన్న హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసారు. దీనిపై చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి.

Update: 2024-10-06 12:30 GMT

ఎన్టీఆర్- ఏఎన్నార్ త‌మ కంటే స‌గం వ‌య‌సు ఉన్న హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసారు. దీనిపై చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల మ‌న స్టార్ హీరోలు త‌మ వ‌య‌సు కంటే రెండు రెట్లు త‌క్కువ వ‌య‌సు ఉన్న యువ‌హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప‌రిశ్ర‌మ ఏదైనా కానీ అక్క‌డ సీనియ‌ర్ హీరోలు త‌మ హ‌వా సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వ‌య‌సును దాచి యువ‌క‌థానాయిక‌ల‌తో దోబూచులాడుతున్నారు.

అదంతా అటుంచితే బాలీవుడ్ లో మిస్ట‌ర్ ర‌ణ‌వీర్ సింగ్ 40 ఏళ్ల వ‌య‌సులో 19 వ‌య‌సు యువ బ్యూటీతో రొమాన్స్ చేయాల‌నుకోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఆదిత్య ధర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రంలో క‌థానాయిక‌గా 19 ఏళ్ల సారా అర్జున్‌ను ఎంపిక చేసినట్లు క‌థ‌నాలు వెలువ‌డ‌గానే.. రణవీర్ సింగ్ ఆన్‌లైన్ విమర్శకులకు టార్గెట్ గా మారాడు.

సారా బాలనటిగా సుపరిచితురాలు. సారా త‌మిళ చిత్రాల‌లో న‌టించింది. ఇటీవల మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్‌`లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ చిన్నప్ప‌టి వెర్షన్‌ను పోషించింది. వచ్చే ఏడాది రణవీర్‌కు 40 ఏళ్లు నిండడంతో ఇద్దరు నటుల మధ్య 20 ఏళ్ల వయస్సు అంతరం నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. 40వ‌య‌సు పెద్దాయ‌న‌తో ఆ యువ‌తి న‌టించ‌డం స‌రికాద‌నే అభిప్రాయం చాలా మందిలో వ్య‌క్తం కాగా, అది తెర కోసం న‌ట‌న మాత్ర‌మే మేం స‌మ‌ర్థిస్తామ‌న్న ఫ్యాన్స్ కూడా లేక‌పోలేదు.

Tags:    

Similar News