రాబిన్ హుడ్ ట్రైలర్: సర్ ప్రైజ్ ఇచ్చారు కానీ..

బ్లాక్‌బస్టర్స్ 'ఛలో', 'భీష్మ' తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ‘రాబిన్ హుడ్’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి;

Update: 2025-03-24 03:38 GMT

బ్లాక్‌బస్టర్స్ 'ఛలో', 'భీష్మ' తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ‘రాబిన్ హుడ్’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్‌పై వస్తుండటంతో ఈ సినిమా పై హైప్ రోజురోజుకీ పెరిగిపోతోంది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌కి వర్కౌట్ అయ్యేలా ప్రమోషన్స్‌లో రకరకాల వెరైటీలు చేస్తున్నారు. ఎట్టకేలకు గ్రాండ్‌గా ట్రైలర్ విడుదల చేయడంతో సినిమా పట్ల అంచనాలు మరో స్థాయికి చేరాయి.

ట్రైలర్ మొత్తం హ్యూమర్‌, యాక్షన్‌, ఎమోషన్‌, అడ్వెంచర్‌తో నిండిపోయి ఉంది. నితిన్‌కి సరిపోయే చురుకైన పాత్ర, ఆయన ఎనర్జీకి తగ్గట్టు సన్నివేశాలు, శ్రీలీలతో కెమిస్ట్రీ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ పాటు మంచి విలన్ లైన్ సినిమాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కథ ప్రకారం నితిన్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అయి, ఎన్నారై శ్రీలీలకు సన్నిహితుడవుతాడు. ఈ నేపథ్యంలో అతను తన అసలైన లక్ష్యాన్ని బయటపెడుతూ ఓ ద్వీపాన్ని శాసిస్తున్న పవర్ఫుల్ విలన్ ను టార్గెట్ చేస్తాడు.

ఇది ఒక అడ్వెంచరస్ ప్రయాణం కావడం, ట్రైలర్‌లో కనిపించిన, మిషన్ బ్యాక్‌డ్రాప్ లతో కూడిన సన్నివేశాలు సినిమాను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేశాయి. ట్రైలర్‌లో డైలాగ్స్, పంచ్‌లు కూడా హైలెట్ అయ్యాయి "ఫోర్ ఫాదర్స్", "జెడ్ ప్లస్ క్యాటగిరీ" వంటి డైలాగ్స్ క్లిక్కయ్యేలా ఉన్నాయి. వెంకీ కుడుముల బ్రాండెడ్ కామెడీ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్ తో మొత్తంగా సర్ ప్రైజ్ అయితే ఇచ్చారు. కానీ వార్నర్ క్యారేక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు.

అలాగే, క్రేజీ గెస్ట్ అప్పియరెన్స్‌గా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించడం సినిమాకు మరో అడ్వాంటేజ్. వార్నర్ క్యారెక్టర్ ఎంత స్క్రీన్ టైమ్‌లో కనిపించబోతుందో తెలియదు కానీ ట్రైలర్‌లో ఆ సన్నివేశం చప్పట్లకు గురవుతోంది. ఇక జీవీ ప్రకాష్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి ఊపునిచ్చింది. విశ్వాల్ క్యాలిబర్ పరంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, మేకింగ్ స్టాండర్డ్‌లో మరో స్థాయికి తీసుకెళ్లింది. కామెడీకి, మాస్‌కు, యాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా టోటల్ ట్రైలర్ కట్ చాలా సజావుగా ఉంది. శ్రీలీల గ్లామర్, నితిన్ ఎనర్జీ ట్రైలర్‌లో స్పష్టంగా మెరుస్తున్నాయి.

మార్చి 28న విడుదలకానున్న ఈ సినిమా సమ్మర్ స్టార్టింగ్‌కు చక్కటి ట్రీట్ అవ్వనుంది. ఇటీవల కాలంలో నితిన్ వరుస సినిమాలతో కాస్త నిరాశపరచగా, ఇప్పుడు ‘రాబిన్ హుడ్’తో నితిన్ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యేలా ట్రైలర్ నమ్మకాన్ని ఇచ్చింది. మరి ఈ ట్రైలర్ హైప్ బాక్సాఫీస్ దగ్గర కూడా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Full View
Tags:    

Similar News