పదే పదే పేరు మార్చుకొని కన్ఫ్యూజ్ చేస్తున్న హీరో
సాయి ధరమ్ తేజ్ బదులుగా ఇప్పుడు అతడిని సాయి దుర్గా తేజ్ అని పిలవాలట. ఇంతకీ ఈ దుర్గా ఎవరు? అంటే అది తన తల్లి గారి పేరు. సెంటిమెంట్ గా తన పేరుకు యాడ్ చేసాడు.
టాలీవుడ్ లో తనదైన ఎనర్జిటిక్ డ్యాన్సులు.. షటిల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పిస్తున్న యువ మెగా హీరో మరోసారి పేరు మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరంభం 'రేయ్' సినిమాతో సాయి ధరమ్ తేజ్ గా తెరకు పరిచయం అయ్యాడు. కాలక్రమంలో ఫ్లాపులతో కెరీర్ డైలమాలో పడిన క్రమంలో అతడు తన పేరులోని కొన్ని అక్షరాలను తొలగించాడు. 'ధరమ్'ను తొలగించి సాయి తేజ్! తన కొత్త పేరు అని వెల్లడించాడు. అయితే పేరులోంచి ధర్మాన్ని తొలగించడంతో అది కొందరు అభిమానులకు రుచించలేదు.
ఇక ఈ మార్పుతో చాలా కాలంగా మీడియా రైటర్లు కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. కొందరు పేరులో ధరమ్ ని యాడ్ చేసి రాస్తుంటే, కొందరు సాయి తేజ్ అని సింపుల్ గా రాస్తున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరోసారి మెగా యువహీరో పేరు మార్చుకుని కన్ఫ్యూజ్ చేసాడు. ఈసారి ధరమ్ స్థానంలో దుర్గా వచ్చి చేరింది. సాయి ధరమ్ తేజ్ బదులుగా ఇప్పుడు అతడిని సాయి దుర్గా తేజ్ అని పిలవాలట. ఇంతకీ ఈ దుర్గా ఎవరు? అంటే అది తన తల్లి గారి పేరు. సెంటిమెంట్ గా తన పేరుకు యాడ్ చేసాడు.
తన పేరును ఇప్పుడు సాయి దుర్గా తేజ్‌గా మార్చుకున్నట్లు అతడు స్వయంగా వెల్లడించాడు. మరోసారి ఈ మార్పు దేని కోసం అని అంటే.. తన తల్లి పేరు తనలో ఉండాలని తన తండ్రి పేరు ఇంటిపేరు రూపంలో ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు. రెండేళ్ల క్రితం పెద్ద యాక్సిడెంట్ కి గురైన సాయి తేజ్ ఇప్పటికే పూర్తిగా కోలుకుని వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదే సమయంలో తన పేరు మార్పుతో సెంటిమెంటును జోడిస్తున్నాడు. తదుపరి అతడు నటించే సినిమాలన్నీ విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సాయి తేజ్ నటించిన సత్య త్వరలో విడుదల కానుంది. దీనికి అతడి స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. పవన్ మావయ్యతో 'బ్రో' చిత్రంలో నటించాను.. నాగబాబు మామతోను కనిపించాను. ఈసారి టార్గెట్ చిరు మామ. తనతో కలిసి నటించాకే ఎవరితో నటించాలో ఆలోచిస్తానని సాయి దుర్గా తేజ్ అన్నారు.