సలార్.. మొత్తానికి సౌండ్ షురూ

బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో 2000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరో

Update: 2023-12-12 08:24 GMT

బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో 2000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరో. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా దాదాపు అదే తరహాలో కేజిఎఫ్ సినిమాలను బాక్సాఫీస్ వద్ద టాప్ పొజిషన్లో నిలబెట్టాడు. అదే సినిమాతో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపును అందుకున్న హోంబెల్ ప్రొడక్షన్స్.. ఇంకొ వైపు. ఇలా అన్ని వైపులా కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వారే సలార్ సినిమా తీస్తూ ఉండడంతో కంటెంట్ మినిమం ఉంటుంది అనేలా ఫ్యాన్స్ లో అయితే ఒక నమ్మకం ఉంటుంది.

బిగ్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశతో కనిపించారు. అయితే సక్సెస్ అనే మాట పక్కన పెడితే అసలు సినిమా విడుదలకు ముందు ఉండాల్సిన హడావిడిలో కొంచెంలో కొంచెం కూడా కనిపించడం లేదు. సినిమా విడుదలకు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేవు అయినప్పటికీ కూడా నిర్మాణ సంస్థ దర్శకుడు హీరో నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ముఖ్యంగా నిర్మాణ సంస్థ ఇప్పటివరకు కనీసం ఒక సాంగ్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇందులో కేవలం ఒకే ఒక సాంగ్ ఉంటుంది అని మొదట టాక్ వచ్చింది. ఇక తర్వాత మళ్లీ విడుదల తేదీ వాయిదా పడడంతో పనిలో పనిగా ఎడిటింగ్లో దర్శకుడు మరొక సాంగ్ యాడ్ చేసినట్లుగా గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనప్పటికీ కె.జె.ఎఫ్ లో మంచి సాంగ్స్ ఇచ్చిన రవి బసృర్ ఈ సినిమాలో ఇచ్చింది కొన్ని సాంగ్స్ అయినా ఏ విధంగా ఆకట్టుకుంటాడో అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం దగ్గర పడుతూ ఉండగా ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఫాన్స్ అయితే సోషల్ మీడియాలో చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు మరింత ఆలస్యం చేస్తున్నారు అని చిత్ర యూనిట్ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తానికి చిత్ర నిర్మాతలు దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సినిమాలోని ఒక పాటను రేపు విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక అందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా మరికొన్ని గంటల్లో ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు బజ్ అయితే బాగానే ఉంది. కానీ ఇంకా ప్రమోషన్స్ తో హైప్ పెంచితే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరొకవైపు బాలీవుడ్ నుంచి డంకీ సినిమా కూడా రాబోతోంది. అలాగే హాలీవుడ్ నుంచి ఆక్వా మ్యాన్ 2 కూడా ఎంతో కొంత పోటీని అయితే ఇస్తాడు. కాబట్టి ఈ తరుణంలో సలార్ యూనిట్ కాస్త హడావిడి చేయాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News