సమంతకు 3 కోట్ల మంది ఇన్‌స్టా ఫాలోవర్స్
సోషల్ మీడియా గేమ్ విషయానికి వస్తే.. అన్ని ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న భారతీయ సినీ ప్రముఖులలో సమంతా రూత్ ప్రభు పేరు మార్మోగుతోంది.
1 కోటి కాదు .. 2 కోట్లు కాదు.. ఏకంగా 3 కోట్లు.. ఇదీ సమంత రేంజ్. అంతమంది ఇన్‌స్టాగ్రమ్‌లో సామ్ ని అనుసరిస్తున్నారు. 30 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో దక్షిణ భారతదేశంలో టాప్ స్టార్ గా సమంత రికార్డులకెక్కింది. ఈ సందర్భంగా సమంత రూత్ ప్రభు ఇన్ స్టాలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక అందమైన ఫోటోని షేర్ చేసింది.
సమంతా రూత్ ప్రభు కొన్నేళ్లుగా పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్సెస్ తో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓలలాడించింది. తెలుగు- తమిళంలో కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ పాత్రల్లో నటించిన సామ్.. పక్కింటి అమ్మాయి పాత్రలతోను మెప్పించింది. మరోవైపు నాయికా ప్రధాన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా తనదైన ముద్ర వేసింది. OTTలో తొలి ప్రాజెక్ట్ - ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నెగెటివ్ షేడ్ ఉన్న రాజీ పాత్రతో అందరి మనసులు దోచింది.
సోషల్ మీడియా గేమ్ విషయానికి వస్తే.. అన్ని ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న భారతీయ సినీ ప్రముఖులలో సమంతా రూత్ ప్రభు పేరు మార్మోగుతోంది. ఇప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి సరికొత్త మైలురాయిని తాకింది. తద్వారా ఈ వేదికపై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అత్యధిక ఫాలోయింగ్ ఉన్న తారలలో ఒకరిగా సమంత రికార్డులకెక్కింది.
ఈ సందర్భంగా తన ఫాలోవర్స్ కి సామ్ కృతజ్ఞతలు తెలిపింది. ఇన్‌స్టా ఫాలోవర్స్ నుండి తనకు లభించిన ప్రేమ అభిమానాలకు ఉబ్బితబ్బిబ్బవుతున్న సామ్ తన అధికారిక ఇన్ స్టా హ్యాండిల్ లో స్పెషల్ పోస్ట్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో విహారయాత్రలో ఉన్న సమంతా రూత్ ప్రభు '30 మిలియన్ (4 రెడ్ హార్ట్ ఎమోజీలు)' అనే శీర్షికతో ఒక పురాతన భవనం వద్ద పిట్టగోడపై కూచుని ఇలా స్మైలిస్తూ కనిపించింది. ఈ ఫోటోగ్రాఫ్ లో సమంత ఎంతో సింపుల్ గా ఆఫ్ వైట్ ప్రింటెడ్ ఓవర్‌సైజ్ స్వెట్‌షర్ట్‌లో అందంగా కనిపిస్తోంది.
సమంత కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. దేవరకొండతో 'ఖుషి' విజయం సాధించిన తర్వాత తన నటనా జీవితం నుండి సుదీర్ఘ విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. సమంత ఇప్పుడు ఎక్కువ సమయం ప్రయాణాలతోనే గడుపుతోంది. మరోవైపు అమెరికాలో మయోసైటిస్ కి చికిత్స పొందుతోంది. అయితే ఈ విరామానికి ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో స్పై థ్రిల్లర్ సిరీస్ భారతీయ స్పిన్-ఆఫ్ అయిన 'సిటాడెల్' షూటింగ్‌ను ముగించింది. ది ఫ్యామిలీ మ్యాన్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు - కృష్ణ డికెలతో కలిసి సామ్ మరోసారి పని చేసింది. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించాడు. సిటాడెల్ 2024 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇన్ స్టాలో రష్మిక మందనకు 28.5 మిలియన్లు, కాజల్ అగర్వాల్ కి 21 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పూజా హెగ్డేకి 17.5 మిలియన్లు, అనుపమ పరమేశ్వరన్ కి 10.5 మిలియన్లు, రాశీ ఖన్నాకు 8 మిలియన్ల మంది అనుచరులు ఇన్ స్టాలో ఉన్నారు.