సరిపోదా శనివారం.. నేచురల్ లుక్ లో నాని స్టైలే వేరు

ఈ చిత్రంలో నాని పోషిస్తున్న సూర్య పాత్ర శనివారాల్లో ప్రత్యేకంగా ఉంటుంది అని టీజర్ లో చూపించారు.

Update: 2024-07-04 12:48 GMT

హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కలిసి చేస్తున్న రెండవ చిత్రం 'సరిపోదా శనివారం'. మొదట వీరి కాంబినేషన్ లో వచ్చిన అంటే.. సుందరానికి.. సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈసారి తొలి చిత్రంతో పోలిస్తే, ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాని పోషిస్తున్న సూర్య పాత్ర శనివారాల్లో ప్రత్యేకంగా ఉంటుంది అని టీజర్ లో చూపించారు.


టీజర్ లో నాని చాలా అగ్రేసీవ్ గా కనిపించారు. గతంలో ఎప్పుడు లేనంత సరికొత్త గెటప్ లో నాని కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. సూర్య క్యారెక్టర్ లో మరో షెడ్ ను చూపిస్తూ రెండవ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో నాని సాధారణంగా కనిపించే ఒక యువకుని పాత్రలో కనిపిస్తున్నారు. ఒక బైక్ పై సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.

ఇది నానికి ఉన్న ప్రత్యేకత, ఆయన క్లాస్ మరియు మాస్ క్యారెక్టర్స్ ను సమానంగా మెప్పిస్తారుని అని చెప్పవచ్చు. నాని పాత్రలో రెండు విభిన్నతలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది. DVV దానయ్య మరియు కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఎస్‌జే సూర్య విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.

టీజర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశారు. దీంతో సినిమాకు పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. నిర్మాతకు నాన్ థియేట్రికల్ గా మంచి డీల్స్ సెట్ అయ్యాయి. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది అని మేకర్స్ చెబుతున్నారు. ఇక సరిపోదా శనివారం చిత్రంలో, నాని పాత్ర విభిన్న క్షణాల్లో ఏ విధంగా ఉంటుందో చూడలనే ఆసక్తిని కలిగిస్తోంది. సూర్య పాత్రలోని విభిన్నతలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

టీజర్ విడుదల చేసినప్పటి నుండి సినిమాపై ఆసక్తి పెరిగింది. నాని ఇలాంటి విభిన్న పాత్రలను పోషించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది నటుడు. ఈ చిత్రంలో కూడా ఆయన తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను ఆగస్టు 29న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు నాని మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. త్వరలోనే న్యూ ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి.

Tags:    

Similar News

eac