బన్నీ సినిమాపై ఖాన్ సాబ్ రాజకీయామా?
త్రివిక్రమ్ ని సైతం పక్కనబెట్టి బన్నీ అట్లీకి డేట్లు ఇస్తున్నాడని పెద్ద ఎత్తున చర్చ సాగింది. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగిపోవడం అంతే చర్చనీయాంశంగా మారింది
ఐకాన్ స్టార్ అల్జు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈసినిమా గురించి హీరోగానీ, దర్శకుడు గానీ అధికారికంగా ప్రకటించింది లేదు. కానీ మీడియాలో ప్రచారం మాత్రం ప్రాజెక్ట్ కన్పమ్ అయినట్లే బలమైన కథనాలు వెలువడ్డాయి. త్రివిక్రమ్ ని సైతం పక్కనబెట్టి బన్నీ అట్లీకి డేట్లు ఇస్తున్నాడని పెద్ద ఎత్తున చర్చ సాగింది. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగిపోవడం అంతే చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ కొన్ని రకాల కండీషన్లు పెట్టాడని, ముఖ్యంగా పారితోషికంగా 80 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో బన్నీ అండ్ కో వెనక్కి తగ్గినట్టు ప్రచారం సాగుతోంది. మరి అసలు కారణం ఇదేనా? ఇంకేదైనా ఉందా? అంటే తాజాగా ఈ ప్రాజెక్ట్ వెనుక పెద్ద రాజకీయమే చోటు చేసుకుందని కోలీవుడ్ మీడియాలో ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. బన్నీ నుంచి సల్మాన్ ఖాన్ కి ఈ ప్రాజెక్ట్ వెళ్లడం వెనుక ఇద్దరు హీరోలు ప్రధానంగా రాజకీయం చేసారని వినిపిస్తుంది.
వాళ్లే తలపతి విజయ్- బాద్ షా షారుక్ ఖాన్ అని ఓవార్త వైరల్ అవుతోంది. అట్లీ రాసుకున్న కథని బన్నీ తో తీయడం కంటే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో తీస్తే బాగుంటుందని అట్లీకి షారుక్ ఖాన్ సలహా ఇచ్చాడుట. సల్మాన్ ని కలిసే అవకాశం కూడా ఖాన్ సాబ్ నే కల్పించాడుట. అలా సల్మాన్ ఈ ప్రాజెక్ట్ లో కి వస్తున్నట్లు కొత్త ప్రచారం ఊపందుకుంది. అలాగే ఈ మీటింగ్ జరగడానికి ముందే అట్లీ-విజయ్ మధ్య కూడా మరో మీట్ జరిగిందిట.
ఆయన ఇదే కథని షారుక్ ఖాన్ తో తీస్తే బాగుంటుందని సజ్జెస్ట్ చేసాడుట. ఈ విషయం అట్లీ నుంచి షారుక్ ఖాన్ వద్దకు చేరడంతోనే మొత్తం కథ అడ్డం తిరిగిందని అంటున్నారు. విజయ్-షారుక్ ఖాన్ లాంటి ఇద్దరు స్టార్లు చెప్పిన తర్వాత అట్లీ వాళ్ల మాటకు అడ్డు చెప్పే అవకాశమే ఉండదు. వాళ్లిద్దరితో అట్లీ స్నేహం, పరిచయం ఈనాటిది కాదు. ఎంతో కాలంగా కొనసాగుతోన్న బాండింగ్ అది. ఇవన్నీ వెరసి అట్లీకి బన్నీని దూరం చేసినట్లు గుస గుస వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక.