వింబుల్డన్ ఫైనల్ లో సోనమ్ మెరుపులా!
తాజాగా అమ్మడు లండన్ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ కి విచ్చేసిన సందర్భంగా ఫ్యాషన్ ప్రియుల్ని ప్రత్యేకంగా అలరించింది
ఫ్యాషన్ వరల్డ్ సోనమ్ కపూర్ స్టైలిష్ ఎంపికల గురించి పరిచయం అవసరం లేదు. సోనమ్ తొలి నుంచి ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో ముందుంటుంది. మోడ్రన్ దుస్తుల్లో తనదైన బ్రాండ్ బ్యూటీ గా ఫేమస్ అవ్వడంలో స్పెషలిస్ట్. ఆల్ట్రా మోడ్రన్ డిజైన్స్ లో స్టైల్ కా బాప్ అనిపించిన సందర్భాలెన్నో. తాజాగా అమ్మడు లండన్ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ కి విచ్చేసిన సందర్భంగా ఫ్యాషన్ ప్రియుల్ని ప్రత్యేకంగా అలరించింది.
బొట్టెగా వెనెటా రూపొందించిన దుస్తుల్లో తళుక్కున మెరిసింది. పొడవైన గౌనులో అలా వాక్ చేసుకుంటూ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన వైనం వావ్ అనిపిస్తుంది. ప్రీ-ఫాల్ 24 సేకరణ నుండి ఆప్టికల్ క్రింకిల్ కాటన్ చెక్ తో కూడిన అధునాతనమైన అద్భుతమైన డిజైన్ ఇది. పసుపు, నీలం నలుపు రంగులో చెక్స్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది. సొగసైన టెక్స్ మ్యూల్ షూలతో తన రూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దింది.
వింటర్ 24 స్పెషల్ నుండి నలుపు లిబర్టా బ్యాగ్, ఎంపిక చేసిన మిగతా యాక్సరసీస్ ప్రతీది సోనమ్ స్పెషాల్టీని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక సో నమ్ సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం రన్నింగ్ లా కాకుండా వాకింగ్ లా సాగుతోంది. వివాహం చేసుకుని...ఓ బిడ్డకు తల్లైన తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. 2020-24 మధ్య కేవలం ఒక్క సినిమానే చేసింది.
ఆ సినిమా `బ్లైండ్` గత ఏడాది రిలీజ్ అయింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు కమిట్ అయినట్లు రివీల్ చేసింది. కానీ వాటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచింది. షూటింగ్ ఆరంభంలో జాప్యం జరుగుతున్నట్లు ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ వాటిపై సోనమ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.