ఫోటో స్టోరి: కపూర్ లేడీ స్టన్నింగ్ ఫ్యాషన్ షో
కపూర్ ఫ్యామిలీ ఫ్యాషనిస్టా సోనమ్ స్టైల్ కంటెంట్ ఎల్లపుడూ చర్చనీయాంశమే.
కపూర్ ఫ్యామిలీ ఫ్యాషనిస్టా సోనమ్ స్టైల్ కంటెంట్ ఎల్లపుడూ చర్చనీయాంశమే. ముంబై సహా పలు నగరాల్లో ప్రతిష్టాత్మక ఈవెంట్లలో సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్ షోలు హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. పెళ్లి తర్వాత భర్త అహూజాతో విదేశాల్లో సెటిలైన సోనమ్ కొన్ని ప్రతిష్ఠాత్మక ఈవెంట్ల కోసం ముంబైలో అడుగుపెడుతోంది. తన సొంత దుస్తుల లేబుల్ ని అభివృద్ధి చేయడంలోను సోనమ్ ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ చర్చనీయాంశం.
అదంతా అటుంచితే ప్రస్తుతం సోనమ్ ముంబైలో ఉంది. నగరంలోని శాంతాక్రజ్ లింకింగ్ రోడ్లో పాపులర్ బ్రాండ్ కి సంబంధించిన స్టోర్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రత్యక్షమైంది. ఈ వేడుకలో కళ్లన్నీ సోనమ్ పైనే. అంతగా షో స్టాపర్ గా మారింది సోనమ్. అదిరిపోయే బ్లేజర్ ధరించి సోనమ్ బటన్ లెస్ లో చెలరేగిపోయింది. దానికి బ్లాక్ కలర్ బాటమ్ వేర్ని మ్యాచ్ చేసింది. సోనమ్ ఈ ఫోటోగ్రాఫ్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తోంది.
ఈరోజు మదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలు తమ తల్లులతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. సోనమ్ కపూర్ కూడా తన సోషల్ మీడియాల్లో అరుదైన ఫోటోలను షేర్ చేసింది. తన కొడుకు వాయు అమ్మమ్మలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతకుముందు.. కాజోల్, సంజయ్ దత్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ సహా సెలబ్రిటీలు కూడా తమ తల్లులతో ఫోటోలు షేర్ చేసారు.
సోనమ్ కపూర్ -ఆనంద్ అహూజా 2018 లో వివాహం చేసుకున్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నప్పుడు నేను ఆనంద్‌ని మొదటిసారి కలిశాను. ఒక సాయంత్రం తాజ్ వద్ద ఉన్న ఒక బార్ని సందర్శించడానికి నా స్నేహితులు నన్ను ఒప్పించారు. నేను చాలా చిరాకుగా అక్కడికి వెళ్లాను. అక్కడే అతడితో పరిచయం ప్రేమగా మారిందని సోనమ్ గతంలో తెలిపింది. సోనమ్ - ఆనంద్ 2022లో పేరెంట్‌హుడ్‌ని స్వీకరించారు. దంపతులు వారసుడు వాయును స్వాగతించారు.