దగ్గుబాటి పెళ్లి వేడుకలో శ్రీలీల.. మ్యాటరేంటంటే
చేతి నిండా సినిమాలో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన డాక్టర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజేయెస్ట్ హీరోయిన్ ఎవరంటే శ్రీలీల అనే టక్కున చెప్పేస్తారు. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కడ ఎప్పుడు కనిపించినా ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. చేతి నిండా సినిమాలో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన డాక్టర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ విషయాన్ని ఆమెనే చాలా సార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.
సినిమా షూటింగ్స్ లో బిజీబిజీగా గడుపుతూనే హీరో నితిన్ తో కలిసి ఆమె యాక్ట్ చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అయితే ఈ బ్యూటీ తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట జరగనున్న వివాహ వేడుకలో మెరవనుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. ఆమెకు దగ్గుబాటి ఫ్యామిలీకి ఏంటి రిలేషన్ అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అసలు విషయమేమిటంటే?
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో తనయుడు, హీరో రానా తమ్ముడు అభిరామ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దగ్గుబాటి వారసుడిగా అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభిరామ్.. పెళ్లి చేసుకోనున్నారు. డిసెంబర్ 6న తేదీన శ్రీలంకలోని అనంతర కలుతార అనే 5 స్టార్ హోటల్ లో ప్రత్యూష అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఇదంతా ఓకే గానీ.. అసలు శ్రీలీల ఎందుకు వెళ్లనుందంటే?
దగ్గుబాటి ఇంట అడుగుపెట్టనున్న నవ వధువు ప్రత్యూష, శ్రీలీల చిన్ననాటి స్నేహితులట. ఒంగోలు సమీపంలోనే వారి ఊళ్లట. అమెరికాలో చదువుకున్నప్పుడు కూడా వీరిద్దరూ క్లాస్ మేట్స్ ని తెలుస్తోంది. అందుకే తన బెస్టీ పెళ్లికి అటెండ్ అవ్వడానికి శ్రీలంక వెళ్లనుందట. మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నా.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి అందుకే వెళ్లనుందట.
మరోవైపు, సోమవారం సాయంత్రం నుంచి అభిరామ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయట. బుధవారం ఉదయం హల్దీ వేడుక జరగనుందట. అదే రోజు రాత్రి 8 గంటలకు వివాహం జరగనుందని సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సుమారు 200 మంది వరకు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారట.