SSMB29: ఇలా చేస్తారని అనుకోలేదు, కానీ..

ఇక మహేష్ బాబు సెంటిమెంట్స్ కూడా రాజమౌళి ప్రాజెక్టు వలన బ్రేక్ అవుతున్నాయి.

Update: 2024-06-01 05:26 GMT

టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SSMB29 పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అప్డేట్స్ ఏమైనా ఇస్తారేమో అని ఎప్పటికప్పుడు ఆసక్తిగా ఉన్నారు. అయితే పుట్టినరోజులు దాటిపోతున్నా కూడా కనీసం సింగిల్ అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. అసలు రాజమౌళి వర్క్ ఎంతవరకు వచ్చింది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

ఇక మహేష్ బాబు సెంటిమెంట్స్ కూడా రాజమౌళి ప్రాజెక్టు వలన బ్రేక్ అవుతున్నాయి. సాధారణంగా మహేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా తన తండ్రి పుట్టినరోజున ఎదో ఒక అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈసారి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ చిత్రంపై అప్డేట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ, వారి నిరీక్షణకు తీవ్ర నిరాశే ఎదురైంది.

మహేష్ కు అత్యంత ఇష్టమైన తండ్రి పుట్టినరోజు ఫ్యాన్స్ కు ఎదో ఒక సర్ ప్రైజ్ ఇవ్వడమంటే చాలా ఇష్టం. అలాంటిది SSMB28 కి కనీసం ఒక విషెస్ పోస్టర్ కూడా పడలేదు. ఇస్తే సాలీడ్ గా ఇవ్వాలి లేదంటే సైలెంట్ గా ఉండాలి అనుకున్నారో ఏమో గాని అసలు ఏమాత్రం సౌండ్ చేయకపోవడం షాక్ అనే చెప్పాలి. ఒక విధంగా అదే బెస్ట్ అని ఓ వర్గం ఫ్యాన్స్ అంటున్నారు.

రాజమౌళి ఏ పని చేసినా హై రేంజ్ లోనే ఉంటుంది. ఇక మహేష్ తో చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఏదో నామమాత్రంగా పోస్టర్ వదిలితే బాగుండదని ఆయనకు కూడా బాగా తెలుసు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ప్రాజెక్టు అడుగులు పడే వరకు అప్డేట్స్ ఇవ్వకుడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక జూలై నెలలో ప్రాజెక్టు పై ఒక క్లారిటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారనే పుకార్లపై స్పందించారు. రాజమౌళి టీమ్ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని, భవిష్యత్తులో ఆ అవకాశమొస్తే సంతోషంగా నటిస్తానని తెలిపారు. ఈ వివరణ అభిమానుల్లో మరింత నిరాశను కలిగించింది. వారు కొన్ని అప్డేట్స్ ఆశిస్తున్నపుడు ఇలా అస్పష్టత ఏర్పడటంతో ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ కోరుతున్నారు.

మహేష్ బాబు తదుపరి చిత్రం పై అధికారిక అప్డేట్ రాకపోవడం అభిమానుల్లో అనేక సందేహాలను రేకెత్తించింది. ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని రాజమౌళి నిరంతరంగా చెబుతూ ఉన్నారు. మహేష్ బాబు తప్ప ఇంకా ఎవరూ ఖరారు కాలేదని తేల్చారు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని గాసిప్స్ అయితే వస్తున్నాయి. మరి అఫీషియల్ క్లారిటీలు ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.

Tags:    

Similar News