స్త్రీ2.. కల్కి లెక్కను కూడా దాటేసింది..

ఈ ఏడాది ప్రథమార్ధంలో హిందీ చిత్రపరిశ్రమకి చెప్పుకోదగ్గ సక్సెస్ లు రాలేదు. స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి

Update: 2024-08-23 04:56 GMT

ఈ ఏడాది ప్రథమార్ధంలో హిందీ చిత్రపరిశ్రమకి చెప్పుకోదగ్గ సక్సెస్ లు రాలేదు. స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టలేదు. అయితే ద్వితీయార్ధంలో కల్కి 2898ఏడీ సినిమాతో హిందీ పరిశ్రమకి కొంత ఊరట లభించింది. హిందీ డబ్బింగ్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 293 కోట్ల కలెక్షన్స్ ని నార్త్ ఇండియాలో వసూళ్లు చేసింది.

స్ట్రైట్ హిందీ సినిమాతో బయ్యర్లకి నష్టాలు వస్తే కల్కి మూవీ మాత్రం వారిని కాస్తా సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చింది. అయితే హిందీలో శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో తెరకెక్కి ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన స్త్రీ2 మూవీ మాత్రం మరల బాలీవుడ్ కి జీవం పోసేలా కనిపిస్తోంది. గత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ని షారుఖ్ ఖాన్ తన పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో కాస్తా సేవ్ చేశాడు. ఈ ఏడాది స్త్రీ2 మూవీ హిందీ పరిశ్రమకి ఊపిరి పోసింది.

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఇప్పటి వరకు ఉన్న కల్కి 2898ఏడీ రికార్డ్ ని స్త్రీ2 మూవీ 8 రోజుల్లోనే బ్రేక్ చేసింది. ఈ సినిమా మొదటి వారంలో ఏకంగా 289 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఎనిమిదో రోజు కలెక్షన్స్ తో ఈ చిత్రం 300 కోట్ల మార్క్ ని దాటేసింది.

శని, ఆదివారాలతో పాటు సోమవారం కృష్టాష్టమి ఫెస్టివల్ కూడా నెక్స్ట్ స్త్రీ2 సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్త్రీ2 మూవీ 500-600 కోట్ల వరకు కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్ ని నిర్మాతకి అందించేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

స్త్రీ మూవీ లాంగ్ రన్ లో 180+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటే దానికి సీక్వెల్ గా వచ్చిన మూవీ మొదటి 8 రోజుల్లోనే 300 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఈ ఏడాది బాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాల జాబితాలో స్త్రీ2 మూవీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో స్త్రీ పార్ట్ 3 మూవీకి కూడా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News