ఏడాది తర్వాత అక్కడ కళకళ

2024 సంవత్సరంలో ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా కూడా పట్టుమని పది సినిమాలు కూడా మినిమం విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి.

Update: 2024-08-22 17:18 GMT

బాలీవుడ్‌ గత నాలుగు సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత ఏడాది కాస్త పర్వాలేదు అనిపించినా కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా బిగ్గెస్ట్‌ హిట్ గా నిలిచిందే లేదు. 2024 సంవత్సరంలో ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా కూడా పట్టుమని పది సినిమాలు కూడా మినిమం విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. ఇలాంటి సమయంలో పెద్ద హీరోలు సాధించలేని రికార్డులను, వసూళ్లను పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన స్త్రీ 2 సినిమా సాధించింది. మొదటి వారం రోజుల్లో ఏకంగా రూ.401 కోట్ల వసూళ్లను నమోదు చేసి సంచలనం సృష్టించింది.


స్త్రీ 2 మూవీ పడిపోతున్న బాలీవుడ్‌ ని నిలిపింది, గాలిలో కలుస్తున్న ఆయువును కాపాడింది అంటూ సినీ విశ్లేషకులు, మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. సౌత్‌ సినిమాల జోరు ముందు హిందీ సినిమా తేలిపోయింది అంటూ వస్తున్న విమర్శలు, కామెంట్స్ కు సమాధానం గా నిలిచిన స్త్రీ సినిమా మొదటి వారం రోజులు సాధించిన వసూళ్లు మొత్తం బాలీవుడ్‌ కి ఊపిరి ఊదినట్లు అయ్యింది. రికార్డ్‌ స్థాయి వసూళ్లను నమోదు చేయడం ద్వారా మళ్లీ బాలీవుడ్‌ కి మంచి రోజులు వస్తాయనే నమ్మకం ను కలిగించింది.

హిందీ సినిమా నిర్మాతలు, బయ్యర్లు పెద్ద హీరోల సినిమాలను కొనుగోలు చేయాలంటే, భారీ బడ్జెట్‌ తో సినిమాలు నిర్మించాలంటే భయపడుతున్న ఈ రోజుల్లో చిన్న బడ్జెట్ తో వచ్చిన స్త్రీ 2 సినిమా వందల కోట్లు సాధించడం ద్వారా కొత్త ఆశలు చిగురించేలా చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్త్రీ 2 సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహో బ్యూటీ శ్రద్దా కపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, రాజ్ కుమార్‌ రావు హీరోగా నటించాడు.

సూపర్‌ హిట్‌ మూవీ స్త్రీ కి ఈ సినిమా సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. స్త్రీ 2 సినిమా ప్రకటించిన సమయంలో చాలా మంది కనీసం ఆసక్తి చూపించలేదు. కానీ విడుదల అయిన తర్వాత మౌత్‌ టాక్‌ తో ఒక్కసారిగా వసూళ్లు పెరిగాయి. మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు మరియు మూడో రోజు సినిమాకు ఎక్కువ వసూళ్లు నమోదు అయినట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమాకు మంచి కంటెంట్‌ మరియు డీసెంట్‌ టాక్‌ వస్తే భారీ వసూళ్లు నమోదు అవుతాయని స్త్రీ 2 నిరూపించింది. అందుకే ఇకపై అదే ఫార్ములా తో బాలీవుడ్‌ సినిమాలు వస్తే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News