ఫోటో స్టోరి: సుహానా సిగ్గుపడితే అందం
కింగ్ ఖాన్ షారూఖ్ లెగసీని ముందుకు నడిపించేందుకు వారసురాలు సుహానా నటనలో ప్రవేశించిన సంగతి తెలిసిందే
కింగ్ ఖాన్ షారూఖ్ లెగసీని ముందుకు నడిపించేందుకు వారసురాలు సుహానా నటనలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. `ది ఆర్చీస్` సిరీస్‌తో నటనను ప్రారంభించింది. సినీవినీలాకాశంలో సుహానా సుదీర్ఘ ప్రయాణానికి తొలి అడుగు ఇది. తదుపరి వరుస చిత్రాల్లో నటించేందుకు ఈ భామ పూర్తి ప్రిపరేషన్ లో ఉంది. ఇంతలోనే తన అభిమానులకు సోషల్ మీడియాల్లో టచ్ లో ఉంటోంది. నిరంతరం అందమైన ఫోటోషూట్లను వీడియో షూట్లను సుహానా షేర్ చేస్తోంది.
తాజాగా సుహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సుహానా పూల ఫ్రాకులో చాలా అందంగా కనిపించింది. ఈ లుక్ వేసవి వైబ్‌లను ఇస్తుంది. ప్రస్తుతం సుహానా ఫోటోలు వైరల్ గా మారాయి. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అనన్య పాండే దీనిపై స్పందించింది. ఈ వేషధారణ కోసం మినిమలిస్టిక్ మేకప్ పోకర్-స్ట్రెయిట్ హెయిర్‌ను ఎంచుకుంది. సుహానా నిస్సందేహంగా చాలా అందంగా కనిపిస్తోందని అభిమానులు ఈ ఫోటోలకు కాంప్లిమెంట్లు ఇచ్చారు. ఒక రీల్‌ను పోస్ట్ చేయండి అని సుహానా స్నేహితురాలు అనన్య వ్యాఖ్యానించారు. అభిమానులు కూడా కామెంట్లు చేశారు. సుహానా సహజమైన అందగత్తె అని కూడా అభిమానులు కాంప్లిమెంట్ ఇచ్చారు. సుహానా సిగ్గు పడినా అందమే అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించగా.. సుహానా సొగసు చూడతరమా? అంటూ ఒక అభిమాని కొంటెగా వ్యాఖ్యానించాడు.
సుహానా ఖాన్ తన మొదటి ఫీచర్ ఫిల్మ్ కోసం సిద్ధమవుతోంది. ఇది కచ్ఛితంగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని కూడా తెలుస్తోంది. సుహానా ఖాన్ తన తదుపరి చిత్రంలో కింగ్ ఖాన్ తో కలిసి కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్‌ను పర్యవేక్షించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఈ ఏడాది మేలో సెట్స్ పైకి వెళ్లనుంది. సిద్ధార్థ్ ఆనంద్ -సుజోయ్ ఘోష్ అక్టోబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు అనేక మార్లు సమావేశమయ్యారు. షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్‌లతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. సుజోయ్- సిద్ .. ఎస్ఆర్కెతో స్క్రిప్ట్‌పై నిశితంగా పని చేస్తున్నారు. ప్రపంచ స్థాయి యాక్షన్ సన్నివేశాల రూపకల్పన పూర్తిగా సిద్ధార్థ్ బాధ్యత.. అని తెలిసింది.