ఈగల్ తో పోటీ.. సందీప్ కిషన్ ఏమన్నాడంటే..

మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ సినిమాను సంక్రాంతి టైమ్ లోనే విడుదల చేయాలి అని నిర్మాతలు గట్టిగానే ప్రయత్నాలు చేశారు

Update: 2024-01-18 11:24 GMT

మాస్ మహారాజ రవితేజ నటించిన ఈగల్ సినిమాను సంక్రాంతి టైమ్ లోనే విడుదల చేయాలి అని నిర్మాతలు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే నాలుగు సినిమాల మధ్యలో పోటీ ఎక్కువగా ఉండటం వలన థియేటర్లో సమస్యలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇక ఎవరో ఒకరు తప్పుకుంటే బాగుంటుంది అని నేను నిర్మాతలు అందరూ కూడా చర్చలు జరపగా ఫైనల్ గా రవితేజ ఈగల్ సినిమా వెనకడుగు వేసింది.

ఒక విధంగా అలాంటి నిర్ణయం తీసుకోవడమే సినిమాకు కూడా చాలా ప్లస్ అయింది అని కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే సంక్రాంతి నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈగల్ కు కొత్త డేట్ విషయంలో కూడా కొంత పోటీ ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి నుంచి తప్పుకున్నందుకు తప్పకుండా ఈ సినిమాకు సోలోడేట్ దక్కుతుంది అని అందరూ అనుకున్నారు. నిర్మాతల మండలి కూడా అదే చెప్పింది.

ఇక ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో డీజే టిల్లు సీక్వెల్ సినిమాతో పాటు ఇప్పుడు ఊరు పేరు భైరవకోన అనే సినిమా కూడా రాబోతోంది. సస్పెన్స్ మిస్టరీ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. చూస్తుంటే ఈ సినిమా కూడా విరుపాక్ష తరహాలో ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి.

అయితే మొత్తానికి సోలోడేట్ దక్కుతుంది అనుకున్నా ఈగల్ సినిమాకు ఇప్పుడు ఈ సినిమా నుంచి కూడా పోటీ అయితే ఏర్పడుతోంది. ఇక ఈ విషయంపై సందీప్ కిషన్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి మేము కూడా సంక్రాంతికి రావాలని అనుకున్నాము. కానీ అప్పుడు పోటీ తీవ్రంగా ఉండడంతో వెనుకడుగు వేశము. ఇక ఫిబ్రవరి 9 అనుకున్నప్పుడు అప్పుడే టిల్లు స్క్వేర్ సినిమా కూడా అదే సమయానికి వస్తుందని తెలుసుకుని నిర్మాతలకు ఫోన్ చేసి మాట్లాడాము. ఆ తర్వాత రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాము.

ఇప్పటివరకు అయితే ఈగల్ టీం నుంచి మాకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే రవితేజను మాత్రం నేను చాలా అభిమానిస్తాను. అంతే కాకుండా ఆ నిర్మాతలతో కూడా మా నిర్మాతకు మంచి సంబంధాలు ఉన్నాయి. దర్శకుడు వీఐ ఆనంద్ కూడా గతంలో రవితేజతో సినిమా చేశాడు. కాబట్టి మాకు ఈగల్ టీం తో మంచి రిలేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఇది పోటీ అని అయితే మేము అనుకోవడం లేదు. ఒకవేళ ఆ టీమ్ నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే మేము మాట్లాడే వాళ్ళం. ఇక మా రిలీజ్ డేట్ విషయంలో అయితే మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఫిబ్రవరి 9న పక్కాగా రాబోతున్నాము. ఏమాత్రం డేట్ మార్చాలనుకున్న చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర ఏళ్ళు కష్టపడ్డామని.. సందీప్ కిషన్ తన వివరణ ఇచ్చాడు.

Tags:    

Similar News