ఓదెల 2.. అదృష్టం ఉంటేనే ఇలాంటి సినిమాలు..!

ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 17 న అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా గురించి మరిన్ని విషయాలు పెంచుకున్నారు.;

Update: 2025-03-22 14:25 GMT

సంపత్ నంది ప్రొడక్షన్ లో వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 వస్తుంది. తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ నటిస్తున్న ఈ సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ లో మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 17 న అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా గురించి మరిన్ని విషయాలు పెంచుకున్నారు.

ఈ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా సంపత్ గారితో 4 సినిమాలు చేశాను. రచ్చ టైం లోనే ఒక సినిమాలో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో ఆయన దగ్గర పనిచేశాక తెలిసింది. ఆయనతో సినిమాలు చేయడం ఆయనతో మాట్లాడటం వల్లే తన కెరీర్ లో మంచి సినిమాలు చేశానని అన్నారు తమన్నా.

రచ సినిమా ముంబైలో ఫ్యామిలీతో చూశాం. ఆ సినిమా అందరికీ అర్థమైంది. బాష అర్థం కాకపోయినా సినిమా ఏం చెబుతుందో వాళ్లకు అర్ధమవుతుందని అన్నారు తమన్నా. ఈ సినిమాకు మేమంతా కలిసి పనిచేశాం. మాకు ఎలాంటి టైటిల్స్ లేవు. అందరం అన్ని పనులు చేశాం. మేమంతా కలిసి చేసిన సినిమా ఇది. ఈ సినిమా నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నా అన్నారు తమన్నా.

ఒక దర్శకుడు నమ్మితేనే ఒక హీరోయిన్ కి ఇలాంటి సినిమాలు వస్తాయని అన్నారు. ఇక సినిమా చేసే టైం లో చాలాసార్లు కెమెరా ముందు ఏదో చేసి మోనిటర్ లో చూస్తే మరోలా కనిపించేది. మాతో పాటు ఒక స్పెషల్ వైబ్ ఈ సినిమాకు అనిపించింది. ఇలాంటి సినిమాలో జర్నీ చేస్తానని నేను అనుకోలేదని అన్నారు తమన్నా.

డైరెక్టర్ అశోక్ తేజ ఓదెల ని అద్భుతంగా తీశారు. అది చూసినప్పుడే పార్ట్ 2 ఉండాలని అనుకున్నా సంపత్ నంది పార్ట్ 2 ఐడియా చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది అంత ఈజీ జోనర్ కాదని అన్నారు తమన్నా. ఒక పల్లెటూరి కథను ఇంత ఎగ్జైటిన్ గా చెప్పడం అంత సామాన్యమైన విషయం కాదు. నేను ఏ సినిమా చేసినా ఆడియన్స్ కు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఉండాలని కోరుకుంటా.. అలాంటి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఓదెల 2 అని అన్నారు తమన్నా.

సినిమాలో భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్ గా అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్ లో హైయెస్ట్ క్లోజప్ ఉన్న సినిమా ఇదే. భైరవీ క్యారెక్టర్ నేచురల్, మ్యూజికల్ గా చూపించడం నిజంగానే పెద్ద ఛాలెంజ్ అని అన్నారు తమన్నా.

Tags:    

Similar News