తేజా సినిమాకు వాళ్లనెలా ఒప్పించారో..?
తేజా సజ్జా సినిమాలో ఈ ఇద్దరు నటించడానికి ఎలా ఒప్పుకున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే అది కథ డిమాండ్ చేసింది కాబట్టే వారు ఒప్పుకున్నారని తెలుస్తుంది.
యువ హీరో తేజా సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించగా ఓ బేబీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక జాంబీ రెడ్డి సినిమాతో సత్తా చాటాడు తేజా సజ్జ. ఆ తర్వాత హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు తేజా సజ్జ. ఆ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ లాక్ చేశారు. సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాలో తేజా సజ్జా తో పాటుగా మరో ఇద్దరు హీరోలు కూడా నటిస్తారని తెలుస్తుంది.
తేజా సజ్జా మిరాయ్ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. అతనే కాదు మంచు హీరో మనోజ్ కూడా సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడట. తేజా సజ్జా సినిమాలో ఈ ఇద్దరు నటించడానికి ఎలా ఒప్పుకున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే అది కథ డిమాండ్ చేసింది కాబట్టే వారు ఒప్పుకున్నారని తెలుస్తుంది. కార్తీక్ ఘట్టమనేని ఈగల్ సినిమా కూడా మంచి కంటెంట్ తో వస్తుందని అంటున్నారు.
అందుకే ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెంట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తీక్ తో మరో సినిమా లాక్ చేసుకున్నారు. మిరాయ్ సినిమాలో దుల్కర్, మంచు మనోజ్ నటిస్తున్నారని తెలిసి ఆ ప్రాజెక్ట్ పై విపరీతమైన బజ్ పెరిగింది. అయితే తెలుగులో సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నా దుల్కర్ సల్మాన్ మిరాయ్ కథ వినగానే తన పాత్ర నచ్చి ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క మంచు మనోజ్ కూడా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ వెండితెర మీద సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో నెగిటివ్ రోల్ తో మెప్పించాలని చూస్తున్నాడు.
ఈ ఇద్దరు తేజా సజ్జ సినిమాలో భాగం అవుతున్నారు. అయితే అసలు మిరాయ్ కథ ఏంటి దానికి వీరిద్దరు ఎందుకు ఓకే చెప్పారు అన్నది డీటైల్డ్ గా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి మిరాయ్ కథ ఎలా ఉంటుంది. తేజా, దుల్కర్, మనోజ్ అసలు ఏమాత్రం ఊహించని ఈ కాంబో సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. ఈ సినిమా పై ఇండస్ట్రీలో కూడా డిస్కషన్స్ మొదలయ్యాయి. మరి ఈ ప్రాజెక్ట్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.