రానా.. మళ్ళీ పాత రూట్లోనే..
రానా దగ్గుపాటి మొదటి సినిమా లీడర్ తోనే నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక తర్వాత కొన్ని కమర్షియల్ యాంగిల్స్ లో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు
రానా దగ్గుపాటి మొదటి సినిమా లీడర్ తోనే నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక తర్వాత కొన్ని కమర్షియల్ యాంగిల్స్ లో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇతర హీరోల సినిమాలలో కూడా పాజిటివ్ నెగిటివ్ అని తేడా లేకుండా నటిస్తున్నాడు. అవసరమైతే గెస్ట్ పాత్రలు కూడా చాలా హ్యాపీగా చేసేస్తున్నాడు.
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపును అందుకున్న రానా ది ఘాజి అనే సినిమాతో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ సినిమా హిందీలో కూడా సాలీడ్ కలెక్షన్స్ లో అందుకుంది. అయితే ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో బీమ్లా నాయక్ సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో కనిపించడం కొంత హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా దగ్గుబాటి సన్నిహితులు అభిమానుల నుంచి రానా ఇలా కంటిన్యూ అవ్వడం అంతగా కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు వచ్చాయి. ఇక విరాటపర్వం టైమ్ కి వచ్చేసరికి ఓపెన్ గా వారి అభిప్రాయాలను చెప్పేశారు. ఇప్పటికైనా ఇలాంటి రోల్స్ తగ్గించి సోలో హీరోగా రావాలి అని కోరుకున్నారు. దీంతో రానా కూడా అప్పుడే ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు.
ఇకనుంచి తన నుంచి ఇలాంటి సినిమాలు పెద్దగా రావు అని సోలో హీరోగా ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తానని అన్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. రజినీకాంత్ 170 వ సినిమాలో ఎప్పటిలానే ఒక సైడ్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా హీరో తరువాతే కాబట్టి మళ్ళీ ఫ్యాన్స్ నుంచి కొంత నెగిటివ్ అభిప్రాయాలు వచ్చే అవకాశం అయితే ఉంది.
ఈ సినిమాలో మొదట ఆ పాత్ర కోసం నానిని సంప్రదించారు. కానీ నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయి అని అతను రిజెక్ట్ చేయడంతో రానా దగ్గుపాటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక దర్శకుడు జ్ఞాన్ వెల్ రాజా చెప్పిన పాయింట్ రానాకు నచ్చడంతో అతను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ క్యారెక్టర్ చూసిన తరువాత రానా అభిమానించేవారు ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.