ప్రభాస్ ఫ్రెండు GOAT లుక్
అతడు నటించిన ప్రయోగాత్మక చిత్రం 'ది గోట్' ఈ సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వం వహించిన మనుగడ డ్రామా చిత్రమిది.
భారీ యాక్షన్ చిత్రం 'సలార్'లో ప్రభాస్ కి ప్రాణ స్నేహితుడిగా నటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. పరిస్థితులు మారాక, స్నేహితులే విరోధులైతే అనే కాన్సెప్టుతో సలార్ 2 తెరకెక్కనుంది. సీక్వెల్ గురించి మాట్లాడుతుండగానే పృథ్వీరాజ్ సుకుమారన్ వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీ స్టార్ అయ్యాడు. ఇటు దక్షిణాది అటు ఉత్తరాది రెండు చోట్లా వరుస అవకాశాలతో బిజీ అయ్యాడు.
అతడు నటించిన ప్రయోగాత్మక చిత్రం 'ది గోట్' ఈ సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వం వహించిన మనుగడ డ్రామా చిత్రమిది. ఎప్పటికైనా గల్ఫ్ లో యజమాని బంధిఖానా నుంచి బయటపడి స్వేచ్ఛగా మనుగడ సాగించాలనుకునే గొర్రెల కాపరి గొప్ప సాహసంగా చెబుతున్నారు. ఈ సినిమాకి ప్రభాస్, రణవీర్, దుల్కర్ లాంటి స్టార్లు బోలెడంత ప్రచారం చేస్తున్నారు. ప్రభాస్ గోట్ చిత్ర అధికారిక 'ఫస్ట్ లుక్'ని రిలీజ్ చేయగా, ఆ తర్వాత 'ది లుక్ బిఫోర్'ని లాంచ్ చేసాడు రణవీర్ సింగ్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రం నుండి పృథ్వీరాజ్ 'బిగినింగ్ లుక్'ని ఆవిష్కరించారు.
దుల్కర్ తన X ఖాతాలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసాడు. ఇందులో పృథ్వీరాజ్ ఛమత్కార అవతార్‌లో ఉన్నాడు. ఆశ వదులుకోని మనిషి 'ఎడారి మనుగడ కథ'కు సాక్షి! #TheGoatLife ప్రపంచవ్యాప్తంగా 10.04.2024న విడుదలవుతోంది! అని క్యాప్షన్‌లో రాశారు. మునుపటి పోస్టర్‌లో పృథ్వీరాజ్ పొడవాటి జుట్టు గడ్డంతో మాసీగా కనిపిస్తే, కొత్త పోస్టర్ మునుపటి లుక్‌కు చాలా భిన్నంగా ఉంది. ఇందులో అతడు తన కుడి కంటికి దగ్గరగా బటన్‌ను పట్టుకుని రంధ్రాల నుంచి చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. పోస్టర్‌లో నవ్వుతూ కనిపించాడు.
ది గోట్ లైఫ్ గురించి ఏమన్నారు?
పృథ్వీరాజ్ X ఖాతాలో ది గోట్ లైఫ్ చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. తాజాగా దుల్కర్ ని బ్రదర్ మ్యాన్ అని పిలుస్తూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. ''ధన్యవాదాలు బ్రదర్ మాన్! @dulQuer (రెడ్ హార్ట్ ఎమోటికాన్)'' అని క్యాప్షన్‌లో రాశారు.
ఇటీవల పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ''గోట్ లైఫ్ మూవీని చిత్రీకరించడం చాలా కష్టమైన పని అని నాకు తెలుసు. ఈ సినిమా నిర్మాణంలో నేను ఎదుర్కొనే సవాళ్ల గురించి నాకు పూర్తిగా తెలుసు. అయినప్పటికీ అది నన్ను శారీరకంగా మానసికంగా నా లిమిటేషన్స్ ని గుర్తు చేసింది. సినిమాలో నా పాత్ర నజీబ్ కోసం ఐదేళ్లు అంకితం చేశాను. ఒకటి కంటే ఎక్కువసార్లు తీవ్రమైన శారీరక పరివర్తనలను ఎదుర్కొన్నందున, పాత్ర రూపాన్ని అనుభూతిని పరిపూర్ణంగా చేయడమే నా లక్ష్యం.. అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అతిపెద్ద పెట్టుబడిని పెడుతున్నారు. నిర్మాణ ప్రమాణాలు, కథ పరంగా.. అలాగే నటన పరంగా గొప్ప పేరు తెస్తుందని అంచనా. ఈ చిత్రంలో జిమ్మీ జీన్-లూయిస్, అమలా పాల్, గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ అబీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం- సౌండ్ డిజైన్‌ను అకాడమీ అవార్డు గ్రహీతలు AR రెహమాన్ , రెసూల్ పూకుట్టి పని చేస్తున్నారు. థియేటర్లలో 10 ఏప్రిల్ 2024న హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.