సలార్ కి ఇది మంచి శకునం
ఒక వేళ డుంకీ రేసు నుంచి తప్పుకుంటే మాత్రం సలార్ మూవీ ఓపెనింగ్స్ కి తిరుగుండదు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉన్న కొన్ని సీక్వెన్స్, ఎడిటింగ్ వర్క్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తికరంగా లేరంట.
ఈ కారణంగా బెస్ట్ అవుట్ పుట్ కోసం మూవీ వాయిదా వేశారు. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకొని డిసెంబర్ నాటికి సలార్ సిద్ధం అవ్వబోతోంది. అయితే సలార్ రిలీజ్ అయ్యే రోజే షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ రిలీజ్ కూడా ఉంది. ఈ డేట్ ని రాజ్ కుమార్ హిరాణీ టీమ్ ఎప్పుడో లాక్ చేసుకున్నారు. సడెన్ గా సలార్ వారికి పోటీగా వచ్చింది.
ఈ ఏడాది వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఉన్న షారుఖ్ డుంకీతో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకోవాలని అనుకుంటున్నారు. అయితే దానికి సలార్ పెద్ద అడ్డంకిగా మారింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. అయిన కూడా డుంకీతో పోల్చి చూస్తే సలార్ కి ఎక్కువ బజ్ ఉంది.
సౌత్ లో అయితే సలార్ ని డుంకీ ఏ విధంగా కూడా డామినేట్ చేయలేదు. ఒక నార్త్ బెల్ట్ లో షారుఖ్ ఇమేజ్ పనిచేసిన ప్రభాస్ క్రేజ్ ఈ మధ్యకాలంలో రెట్టింపు అయిపొయింది. దీంతో ఈ పోటీ ఉంటే కచ్చితంగా రెండు సినిమాలు ఎంతో కొంత నష్టపోవడం గ్యారెంటీ అని డుంకీ టీం ఫిక్స్ అయ్యారని టాక్. మరీ ముఖ్యంగా తమ సినిమాకి మాత్రం భాగా ఎక్కువ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని డుంకీ సినిమాని వచ్చే ఏడాది వాయిదా వేయనున్నారనే టాక్ బిటౌన్ లో వినిపిస్తోంది. త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ క్లారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఒక వేళ డుంకీ రేసు నుంచి తప్పుకుంటే మాత్రం సలార్ మూవీ ఓపెనింగ్స్ కి తిరుగుండదు. లాంగ్ రన్ లో ఏ మేరకు నిలబడుతుంది అనేది మౌత్ టాక్ మీద ఆధారపడి ఉంటుంది.