2024 లో మురిపించబోతున్న కొత్త భామలు!
2023 గుడ్ బై చెప్పి 2024 కి వెల్కమ్ చెప్పడానికి భామలంతా రెడీ అయిపోతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి అడుగు పెట్టడానికి సంసిద్దంగా ఉన్నారు
2023 గుడ్ బై చెప్పి 2024 కి వెల్కమ్ చెప్పడానికి భామలంతా రెడీ అయిపోతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి అడుగు పెట్టడానికి సంసిద్దంగా ఉన్నారు. అదే ఏడాది వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ ని అందుకున్న నడుమ కొంత మంది భామల డెబ్యూలు అంతే ఆసక్తికరంగా మారాయి. మరి ఆ భామలు ఎవరో చూసేస్తే సరి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న 'దేవర' సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ హీరోయిన్ గా పరిచయమైంది. మత్సకార నేపథ్యంలో సాగే స్టోరీ. ఇందులో జాన్వీ లంగావోణి కట్టిన పడుచు పిల్ల లుక్ ఇప్పటికే ఆకట్టుకుంటుంది. అమ్మడు స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. 'రంగస్థలం'లో సమంత లంగావోణీ ధరించినట్లే జాన్వీ 'దేవర' కోసం ధరించడం అంతే ఆసక్తిని రెకెత్తిస్తుంది.
ఈ సినిమా సెట్స్ లో ఉండగానే అమ్మడికి కొత్త అవకాశాలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోలంతా జాన్వీతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో ముంబై బ్యూటీ మానిషీ చిల్లర్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. అమ్మడు ఇప్పటికే సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది. ''సామ్రాట్ పృథ్వీరాజ్' తో బాలీవుడ్ లో అడుగు పెట్టిన అమ్మడికిదే తొలి తెలుగు సినిమా. వరుణ్ కెరీర్ లో మరో ప్రయోగాత్మక చిత్రం. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక మాస్ రాజా రవితేజ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభమైన కొత్త సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అమ్మడు కెమెరా ముందే తెలుగు కుర్రాళ్ల మనసు దొచేస్తుంది. అందం..అభినయం..కట్టుబొట్టు అన్ని యువతని ఆకర్షిస్తున్నారు. హీరోయిన్ ఫీచర్స్ అన్ని భాగ్యలో కనిపిస్తున్నాయి. పెద్ద హీరోయిన్ అవ్వడం ఖాయమంటూ డెబ్యూ కి ముందే గెస్ చేస్తున్నారు. ఇక నోరా ఫటేహీ..ఆషీకా రంగనాధ్ లాంటి భామలు ఇప్పటికే లాంచ్ అయ్యారు. అయితే వాళ్లిద్దరికీ సరైన ఛాన్సులు ఇప్పుడే దక్కాయి. దీంతో 2024లో ఈ భామలు తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేయడం ఖాయం.