అదేంటి.. అంత పెద్ద స్టార్స్ రాకుంటే ఎలా?

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజును ఏటా టాలీవుడ్ ప్రముఖులు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే

Update: 2024-05-21 07:02 GMT

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజును ఏటా టాలీవుడ్ ప్రముఖులు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్.. డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇప్పటికీ నాలుగు సార్లు డైరెక్టర్స్ డేను జరుపుకుంది. ఈ ఏడాది 5వ డైరెక్టర్స్ డే వేడుకలను హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించాలని కొందరు దర్శకులు బృందంగా ఏర్పడి అంతా నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్ యాక్టర్లకు ఆహ్వానం కూడా అందించారు. దీంతో సినీ ప్రేక్షకులంతా ఈ వేడుకను ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. ఇక ఆదివారం రాత్రి ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా డైరెక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ డైరెక్టర్లు హాజరయ్యారు. హీరోలు అల్లు అర్జున్, నాని, అడవి శేష్, అల్లరి నరేష్, ఆనంద్ దేవరకొండ తదితరులు అటెండ్ అయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి రాజమౌళి, త్రివిక్ర‌మ్, సుకుమార్, బోయ‌పాటి శ్రీ‌ను స‌హా ప‌లువురు దిగ్గ‌జ ద‌ర్శ‌కులు హాజరవుతారని చాలా మంది భావించారు. అగ్ర హీరోలు చిరంజీవి, మ‌హేష్‌, ప్ర‌భాస్, చ‌ర‌ణ్ వంటి స్టార్లు కూడా అటెండ‌వుతార‌ని ఆశించారు. కానీ ప్రతిష్టాత్మకమైన వేడుక‌కు వీరంతా రాకపోవడంతో కళ త‌ప్పింద‌ని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. అసలు వారంతా ఎందుకు రాలేదని ఇంకొందరు చర్చించుకుంటున్నారు కూడా. అసలు ఆహ్వానం అందలేదా? బిజీగా ఉన్నారా? అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించి కొందరు విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ దర్శకుడు దాసరికి నివాళులు అర్పించినా.. వినోదాత్మక కార్యక్రమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. కొందరు దర్శకులు దాసరిని గుర్తు చేసుకున్నా.. ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పై ఫోకస్ పెట్టారని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏదేమైనా స్కిట్స్, డ్యాన్సులు వంటివి ఆడియన్స్ ను అలరించేందుకేనని గుర్తుంచుకోవాలి.

మరోవైపు, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్.. ఎంఐపీ పాసులను రూ. 2000లకు విక్రయించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన అనేక మంది అగ్ర నటులు, దర్శకులు హాజరవుతారని ప్రకటించిందట. కానీ వారు చెప్పినట్లు.. టాప్ హీరోలు, దర్శకులు రాలేదన్న విషయం తెలిసిందే. అయితే కొందరు డైరెక్టర్లకు కనీసం ఇన్విటేషన్ కూడా అందలేదని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమో కాదో తెలియదు గానీ.. విమర్శలు మాత్రం వస్తున్నాయి.

Tags:    

Similar News