ఆ స్టార్స్ ని మన స్టార్స్ ఫాలో అయితే బాగుంటుంది!
మరి కొందరు ఈగోలకు వెళ్లి ఇతర హీరోల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు, వయసు ఎక్కువ ఉన్న పాత్రల్లో కనిపించేందుకు ఆసక్తి చూపడం లేదు.
సుదీర్ఘ కాలం పాటు హీరోలుగా నటించి, స్టార్స్ గా.. సూపర్ స్టార్స్ గా పేరు దక్కించుకున్న వారు చాలా మంది వయసు మీద పడ్డ తర్వాత కూడా తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వారిలో కొందరు వారికి వారు తమను ఫ్యాన్స్ వయసు పై బడిన పాత్రలో చూడరేమో అనుకుంటున్నారు.
మరి కొందరు ఈగోలకు వెళ్లి ఇతర హీరోల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు, వయసు ఎక్కువ ఉన్న పాత్రల్లో కనిపించేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలతో పాటు, ఇతర భాషలకు చెందిన కొందరు సీనియర్ హీరోలు కూడా ఇంకా కుర్ర వేషాలు వేస్తూ ఆకట్టుకునేందుకు కిందా మీద పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంకా మమ్ముట్టి తో పాటు మరి కొందరు సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలను, సినిమాలను చేసేందుకు రెడీ అన్నట్లుగా ఫిల్మ్ మేకర్స్ కి చెబుతున్నారు. దాంతో వారు మంచి హిట్స్ కొడుతూ, మంచి పాత్రలు దక్కించుకుంటూ ఉన్నారు.
జైలర్ లో రజిన వయసుకు తగ్గట్లుగా కనిపించాడు, విక్రమ్ లో కమల్ కూడా అలాంటి పాత్రనే చేశాడు. ముందు ముందు కూడా వీరు వయసుకు తగ్గ పాత్రలు చేస్తారనే టాక్ నడుస్తుంది. ఆ విషయం పక్కన పెడితే టాలీవుడ్ సీనియర్ హీరోల్లో కొందరు ఇంకా కూడా తాము మూడు పదుల యంగ్ హీరోలం అన్నట్లుగా వేషాలు వేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి.
అందుకే మన సీనియర్ హీరోలు కూడా నేల విడిచి సాము అన్నట్లుగా కాకుండా వారి వయసుకు తగ్గట్లుగా ఆ రజినీకాంత్, కమల్, మోహన్ లాల్ చేస్తున్నటువంటి పాత్రలు చేస్తే బాగుంటుంది అంటున్నారు. గౌరవం నిలుపుకోవాలి అంటే ఈ సమయంలో వారిని మన సీనియర్ లు ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా ఉంది.