పాన్ ఇండియాని బలంగానే టార్గెట్ చేసినట్లుందే!
తాజాగా మాలీవుడ్ లో మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. టోవినో థామస్ కి జోడీగా 'ఐడెంటిటీ' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ ని పరుగులు పెట్టిస్తుంది. భాషతో సంబంధం లేకుండా వచ్చిన ఏ అవకాశం విడిచిపెట్టడం లేదు. తమిళ్..మలయాళం..తెలుగు..హిందీ అంటూ అన్ని భాషల్ని దున్నేస్తుంది. నవ నాయికల్ని సైతం పక్కకు నెట్టి మరీ అవకాశాల అందుకుంటుంది. 40 పైబడిన తర్వాత ఇన్ని పరిశ్రమల్లో సినిమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ ఒకసారి వేగం తగ్గిన తర్వాత మళ్లీ పుంజుకోవడం అన్నది కష్టతరంగా ఉంటుంది.
కానీ త్రిష అందుకు భిన్నగా జర్నీ ని ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ మోహన్ లాల్ సరసన 'రామ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా మాలీవుడ్ లో మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. టోవినో థామస్ కి జోడీగా 'ఐడెంటిటీ' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా షూట్ లో భాగంగా త్రిష తన పార్ట్ కి సంబంధించిన షూట్ మొత్తం పూర్తి చేసింది. మళ్లీ డబ్బింగ్ వరకూ త్రిష అవసరం లేదని తెలుస్తుంది. పాత్రకి సంబంధించి డబ్బింగ్ అవసరమైనప్పుడు మళ్లీ హాజరవుతుంది. అలాగే రిలీజ్ సమయంలో ప్రచారం లో పాల్గొంటుంది. ఇందులో త్రిష పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అమ్మడు 2024 లో ఒకేసారి రెండు మలయాళ సినిమాలతో ప్రేక్షకల్ని అలరించడం ఇదే తొలిసారి అవుతుంది.
ఐదేళ్ల క్రితమే మాలీవుడ్ లో కి త్రిష ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో కొనసాగలేదు. దీంతో మాతృభాషలోనే కొనసాగింది. మళ్లీ ఇంత కాలానికి అక్కడా కంబ్యాక్ అయింది. ఈసారి మాత్రం సీరియస్ గానే సినిమాలు చేసే యోచనలో ఉంది. పాన్ ఇండియా వైడ్ హీరోయిన్ల నుంచి టప్ కాంపిటీషన్ కనిపిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లు అంతా సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేయడంతో త్రిష కూడా అంతే సీరియస్ గా మార్కెట్ ని బిల్డ్ చేసుకునే పనిలో భాగంగానే అన్ని పరిశ్రమల్లో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.