నందుల స్థానంలో గద్దర్ అవార్డులు!
ఏటా తెలుగు పరిశ్రమ ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుల ప్రదానోత్సవం నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఏటా తెలుగు పరిశ్రమ ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుల ప్రదానోత్సవం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణలోగానీ..ఇటు ఏపీలో గానీ నందుల ఇవ్వడం అన్నది నిలిచిపోయింది. ప్రభుత్వం తరుపున అవార్డులు ఇవ్వాలని ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు సినీ ప్రముఖులు కలిసి విషెస్ తెలియజే యడం..పరిశ్రమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 24 క్రాప్ట్స్ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ని కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం సుమారు గంటపాటు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
చిన్న..పెద్ద సినిమాల విషయంలో నిర్మాతలు ఎదుర్కోంటున్న ఇబ్బందులు.. టికెట్ ధరలు..పైరసీ వంటి అంశాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే తెలంగాణ లో ఉచిత షూటింగ్ లకు ..సింగింల్ విండో అనుమతులు.. మినీ థియేటర్స్..`మా` భవనం తదితరల అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. వీటన్నింటిపై మరో 15 రోజుల్లో పూర్తి స్థాయిలో చర్చించి...అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకుందామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.
అలాగే తెలంగాణలో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తే బాగుంటుంది అన్న అంశం చర్చకు వచ్చినట్లు వినిపిస్తుంది. ఆ రకంగా గద్దర్ సేవల్ని స్మరించుకున్నట్లు ఉంటుందని ప్రభుత్వం సహా పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఏపీలో నంది అవార్డులిస్తే మాత్రం అదే పేరుతో అందించే అవకాశం ఉంది. గద్దర్ అవార్డులనేవి కేవలం తెలంగాణ వరకే పరిమితం చేస్తారు