ఉర్ఫీ పాప.. ఈసారి మరింత ఘాటుగా..

తన ఫ్యాషన్ కు సంబంధించిన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతుందీ అందాల తార.

Update: 2024-06-19 11:11 GMT

బాలీవుడ్ అందాల తార మరియు బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావెద్, తన వినూత్న ఫ్యాషన్ ఎంపికలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తన ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు, బోల్డ్ నెస్ తో ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తన ఫ్యాషన్ కు సంబంధించిన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతుందీ అందాల తార.


ఉర్ఫీ తన ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎంచుకునే డ్రెస్సులు ప్రతి సారి కొత్తగా, ట్రెండీగా ఉంటాయి. ప్రతి సినిమా ఈవెంట్, టీవీ షో, అవార్డు ఫంక్షన్ లో ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. కెమెరాల ఫోకస్ అంతా ఆమె డ్రెస్సింగ్ పైనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ కి ఓ వర్గం ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరికొందరు దారుణంగా ట్రోల్ చేస్తుంటారు.


ఆ మధ్యలో ఒక ఈవెంట్ కు ఉర్ఫీ, బటర్ ఫ్లై డ్రెస్ వేసుకుని హాజరైంది. ఈ మ్యాజికల్ డ్రెస్ నెట్టింట వైరల్ అవ్వగా, స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉర్ఫీని బ్యూటిఫుల్ అంటూ ఇన్ స్టా స్టోరీలో ప్రశంసించింది. తాజాగా ఉర్ఫీ మరోసారి తన మార్క్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంది. రెండు హిందీ అక్షరాల మాదిరిగా ఉన్న వాటితో ఎద అందాలను దాచేసింది. ఇక పింక్ కలర్ హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇక అమ్మడు తన అందాలను మరింత హైలైట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.


ఇక ఆ ఫొటోలకు పింక్ వెనమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే అమ్మడు అప్పుడప్పుడు కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది. తన అందాలను ఒలకబోస్తూ, ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు ఈ ఫోటోలకు ఓ రేంజ్ లో లైకులు, కామెంట్లు కురిపిస్తున్నారు. ఉర్ఫీ స్కిన్ షో వేరే లెవల్ లో ఉందని, ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కొనియాడుతున్నారు.


హిందీ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఉర్ఫీ, ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ అదరగొట్టింది. ఏఎల్టీ బాలాజీ ప్రసారమయ్యే మేరీ దుర్గాలో ఆర్తి పాత్రలో, బేపన్నాలో బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో మీరాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో 'లవ్ సెక్స్ ఔర్ ధోకా 2' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ బ్యూటీ సినీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News