స్టన్నింగ్ క్వీన్ ఊర్వశికి బాలయ్య ఆఫర్
బాలీవుడ్ టు టాలీవుడ్ ఊర్వశి రౌతేలా జర్నీ గురించి తెలిసిందే. ఈ బ్యూటీ పాపులర్ హీరోల సినిమాల్లో ఐటమ్ నంబర్లలో నర్తిస్తోంది.
బాలీవుడ్ టు టాలీవుడ్ ఊర్వశి రౌతేలా జర్నీ గురించి తెలిసిందే. ఈ బ్యూటీ పాపులర్ హీరోల సినిమాల్లో ఐటమ్ నంబర్లలో నర్తిస్తోంది. ఇటీవల `వరల్డ్ కప్ 2023` మ్యాచ్ ల సమయంలో క్రికెట్ స్టేడియంలో అభిమానులను ఉల్లాసపరిచిన ఊర్వశి పలు వివాదాలతోను హెడ్ లైన్స్ లో నిలిచింది. తన స్మార్ట్ ఫోన్ ని పోగొట్టుకుని దానిని తిరిగి పొందేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఇక ఊర్వశి ఇటీవల తిరిగి కెరీర్ పై దృష్టి సారించింది.
ఇప్పటికే నాలుగు తెలుగు చిత్రాల్లో ఐటెం పాటల్లో నర్తించింది ఊర్వశి రౌతేలా. మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`లో `బాస్ పార్టీ` సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. లెజెండరీ డ్యాన్సింగ్ స్టార్ చిరుతో తన డ్యాన్స్ మూవ్‌లను ప్రదర్శించే అరుదైన అవకాశం అందుకుంది ఊర్వశి. ఈ అవకాశం వచ్చినందుకు మెగాస్టార్ - బాబి సహా మెగాభిమానులకు చాలా కృతజ్ఞతలు తెలిపింది. అంతకుముందు గోపిచంద్ సహా పలువురి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించింది ఈ బ్యూటీ.
అయితే ఇప్పుడు `బాస్ పార్టీ..`లో అవకాశం కల్పించిన బాబి మరోసారి ఊర్వశికి అవకాశం కల్పించారని తెలిసింది. నటసింహా నందమూరి బాలకృష్ణతో బాబి ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ఊటీలో జరుగుతోంది. ఇందులో ఊర్వశి కేవలం ఐటమ్ నంబర్ వరకేనా లేక ఏవైనా సీన్లలో నటిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని కూడా టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
పారిస్ ఫ్యాషన్ వీక్ లో మెరుపులు:
ఊర్వశి రౌతేలా ఇటీవల ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో తన హాట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఊర్వశి తన బోల్డ్ వార్డ్రోబ్ ఎంపికలలో హెడ్ టర్నర్ గా మారింది. ఊర్వశి కిల్లర్ లుక్.. అద్భుతమైన ఎలివేషన్ కి ప్యారిస్ ఫ్యాషన్ వరల్డ్ తలొంచింది. బ్లాక్ బికినీలో ఊర్వశి రౌతేలా అద్భుతమైన లుక్ మతులు చెడగొట్టింది. ఈ ఈవెంట్లో ఊర్వశి రౌతేలా బికినీలో బోల్డ్ లుక్‌లో కనిపించింది. నెట్టెడ్ పొడవాటి దుస్తులు స్క్వేర్ లుక్ బ్రాలెట్‌ను ధరించి స్ట్రైకింగ్ ఫోజులతో కట్టిపడేసింది. ఊర్వశి బరువైన ఉలెన్ ష్రగ్ ని ధరించి మరింత మంత్రముగ్ధులను చేసింది. ఊర్వశి తన స్టైలింగ్‌తో లుక్ తో ఆకట్టుకుంది.
ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 69.8 మిలియన్ల వీక్షణలతో విపరీతమైన ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంద. తన రెగ్యులర్ పోస్ట్‌లు, అప్డేట్లతో అభిమానులను ఎంగేజ్ చేస్తోంది.